AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికిత్స పేరుతో డాక్టర్ల అరాచకం.. తనిఖీల్లో షాకింగ్ విషయాలు..

అర్హత లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న క్లినిక్‎లపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కొరడా ఝులిపిస్తుంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో అర్హత లేకుండా నిర్వహిస్తున్న నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ టాస్క్ ఫోర్స్ టీం నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అర్హత లేని ఆస్పత్రులు సీజ్చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ప్రైయివేట్ క్లినిక్‎లపై శుక్రవారం సాయంత్రం వైద్య ఆరోగ్య శాఖ టాస్క్ ఫోర్స్ బృందాలు దాడులు నిర్వహించారు.

చికిత్స పేరుతో డాక్టర్ల అరాచకం.. తనిఖీల్లో షాకింగ్ విషయాలు..
Doctors
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jun 08, 2024 | 9:03 AM

Share

అర్హత లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న క్లినిక్‎లపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కొరడా ఝులిపిస్తుంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో అర్హత లేకుండా నిర్వహిస్తున్న నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ టాస్క్ ఫోర్స్ టీం నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అర్హత లేని ఆస్పత్రులు సీజ్చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ప్రైయివేట్ క్లినిక్‎లపై శుక్రవారం సాయంత్రం వైద్య ఆరోగ్య శాఖ టాస్క్ ఫోర్స్ బృందాలు దాడులు నిర్వహించారు. ఆస్పత్రులు నిర్వహిస్తున్న వారి అర్హతలు చూసి టాస్క్ఫోర్స్ టీం అవాక్కయ్యారు.

అర్హత లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న నాలుగు క్లినిక్‎లపై ఎన్.ఎం.సీ చట్టం 34, 54 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఆస్పత్రులు సీజ్ చేశారు. మరో మూడు ఆస్పత్రుల నిర్వాహకులు తనిఖీ బృందాల రాకను పసిగట్టి ముందే వాటిని మూసేసి, పరారయ్యారు. మరిపెడ మండలంలో పలువురు ఎలాంటి అర్హతలు లేకున్నా ఆస్పత్రులు నిర్వహిస్తు డాక్టర్లుగా చెలామణి అవుతున్నారని వారి దృష్టికి వచ్చింది. స్థాయికి మించి వైద్యం చేస్తున్నారని రాష్ట్ర వైద్య మండలికి కొన్ని రోజుల క్రితం ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య, టాస్క్ ఫోర్స్ బృందం శుక్రవారం మరిపెడలోని రవి క్లినిక్, రామారావు క్లినిక్, శ్రీనివాస ప్రథమచికిత్సాలయం, బీవీ నాయర్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేయగా అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఎలాంటి అర్హత లేకుండా క్లినిక్‎లు నిర్వహిస్తూ రోగులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. కార్పొరేట్ ఆస్పత్రుల లెవల్లో వైద్యం నిర్వహిస్తున్నారు. రామారావు క్లినిక్, శ్రీనివాస ప్రథమ చికిత్స కేంద్రం, బీవీ నాయక్ ఫస్ఎయిడ్ సెంటర్ నిర్వాహకులు రామారావు, బీవీనాయక్, ఇస్లావత్ వీరన్నను నకిలీ డాక్టర్లుగా గుర్తించారు. వీరి క్లినిక్‎లను సీజ్ చేసి, నకిలీ డాక్టర్లపై ఎన్ఎంసీ 31, 51 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఐతే ఈ ప్రాంతంలో ఇదో క్లాస్ బిజినెస్‎గా మారింది. తనిఖీ బృందాల రాకను గుర్తించిన మరో ముగ్గురు క్లినిక్‎ల నిర్వాహకులు ముందే మూసేసి పరారయ్యారు. వీరిపై కూడా చర్యలు ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‎లను నిర్వహించేవారు డాక్టర్లుగా చలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఇలాంటి వారిని నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు