Telangana: కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ‎లో వేగం పెంచిన ప్రభుత్వం.. మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు..

కాళేశ్వరం ప్రాజెక్ట్‎పై విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులను వెంటబెట్టుకొని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను సందర్శించారు. మరోవైపు అదే సమయంలో న్యాయ విచారణ కమిటీ జస్టిస్ పినాకి చంద్రబోస్ నేతృత్వంలోని కమిటీ బ్యారేజ్‎లను సందర్శించి వివరాల సేకరించారు. రెండోరోజు కూడా ఈ కమిటీ సుందిళ్ళ బ్యారేజ్‎ను సందర్శించనుంది. ఇప్పటికే రెండు దఫాలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను సందర్శించిన ఇంజనీరింగ్ నిపుణులు, కాంట్రాక్ట్ నిర్మాణ రంగ సంస్థల నుండి వివరాలను సేకరించారు.

Telangana: కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ‎లో వేగం పెంచిన ప్రభుత్వం.. మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు..
Kaleshwaram Project
Follow us
G Peddeesh Kumar

| Edited By: Srikar T

Updated on: Jun 08, 2024 | 8:43 AM

కాళేశ్వరం ప్రాజెక్ట్‎పై విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులను వెంటబెట్టుకొని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను సందర్శించారు. మరోవైపు అదే సమయంలో న్యాయ విచారణ కమిటీ జస్టిస్ పినాకి చంద్రబోస్ నేతృత్వంలోని కమిటీ బ్యారేజ్‎లను సందర్శించి వివరాల సేకరించారు. రెండోరోజు కూడా ఈ కమిటీ సుందిళ్ళ బ్యారేజ్‎ను సందర్శించనుంది. ఇప్పటికే రెండు దఫాలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను సందర్శించిన ఇంజనీరింగ్ నిపుణులు, కాంట్రాక్ట్ నిర్మాణ రంగ సంస్థల నుండి వివరాలను సేకరించారు. జ్యుడీషియరీ కమిటీ తాజాగా మూడో విడత విచారణ చేపట్టింది. జస్టిస్ ఘోష్ కమిటీ మొదటిరోజు శుక్రవారం అన్నారం బ్యారేజ్‎ను సందర్శించారు. 35వ పిల్లర్ వద్ద ఏర్పడిన బుంగ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించి వివరాలు సేకరించారు. సంబంధిత ఇంజనీర్ల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం రాత్రి రామగుండంలోని ఎన్టీపీసీ గెస్ట్ హౌస్‎లో బస చేసిన జ్యూడీషియరీ విచారణ కమిటీ ఈరోజు ఉదయం సుందిళ్ల బ్యారేజ్‎కు చేరుకుంటారు.

సుందిళ్ల బ్యారేజ్‎ను పరిశీలించిన అనంతరం ఇంజనీరింగ్ అధికారుల నుండి వివరాలు సేకరిస్తారు. వారికి కావాలసిన కొన్ని అధికారిక వివరాలను సమకూర్చాలని ఇప్పటికే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో బ్యారేజీల సందర్శన ముగిసిన అనంతరం ఒక నివేదిక సిద్ధం చేస్తారు. ఈ నెలాఖరు వరకు జస్టిస్ పినాకి చంద్రబోస్ కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించే అవకాశం ఉంది. వారు సమర్పించే రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ఇందులో ఎవరెవరిని బాధ్యులను చేయాలనేదానిపై నిర్ణయం తీసుకొని వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే శుక్రవారం ఇంజనీరింగ్ నిపుణులు, కాంట్రాక్ట్ నిర్మాణంగా సంస్థ ప్రతినిధులతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‎లను సందర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈనెల 28వ తేదీలోపు మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సుందిళ్ల బ్యారేజ్ వద్ద పనులు నత్తనడకన సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. జ్యూడిషియరీ విచారణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..