అస్తమించిన ఉషాకిరణం.. ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు కన్నుమూత..

ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూశారు. మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేయాలని సూచించారు. వైద్యులు చెప్పినట్టుగా స్టంట్ వేసిన తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయింది. రెండు రోజుగా తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు ఆయన కన్నుమూశారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు.

అస్తమించిన ఉషాకిరణం.. ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు కన్నుమూత..
Ramoji Rao
Follow us
Srikar T

|

Updated on: Jun 08, 2024 | 7:37 AM

ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూశారు. మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేయాలని సూచించారు. వైద్యులు చెప్పినట్టుగా స్టంట్ వేసిన తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయింది. రెండు రోజుగా తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు ఆయన కన్నుమూశారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు.

ప్రస్తుతం రామోజీరావు వయస్సు 88 ఏళ్లు. వ్యాపార దిగ్గజంగా ఆయనకు గొప్ప పేరుంది. మీడియాతో పాటు అనేక వ్యాపారాల్లో రాటుదేలారు రామోజీరావు. ఈనాడు సంస్థలు, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌, ప్రియా ఫుడ్స్‌ వంటి వ్యాపారాలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అంతేగాక రామోజీ ఫిల్మ్‌ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్, సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు రామోజీరావు.

రామోజీరావు చిన్న రైతు కుటుంబంలో 1936 నవంబర్ 16న జన్మించారు. వెంకటసుబ్బారావు, వెంకటసుబ్బమ్మల పుత్రవాత్సల్యమే రామోజీరావు. చిన్నతనం నుంచే ఆయనకు సాహిత్యంపట్ల అభిరుచి అబ్బింది. ఇంట్లో తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ గుడివాడలో బీఎస్సీ గ్రాడ్యూయేషన్ పూర్తిచేశారు. తనకు తెలిసిన పరిచయస్తులతో అడ్వర్టైజింగ్ రంగంపై దృష్టిపెట్టారు. ఆ తరువాత ఢిల్లీలోని ఒక ప్రముఖ ప్రకటన రంగ సంస్థలో ఆర్టిస్టుగా జీవిత ప్రస్థానాన్ని సాగించి అంచెలంచెలుగా ఎదిగారు. 3 సంవత్సరాలు అలా పనిచేసి హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేసేందుకు సంకల్పించారు.

జీవన ప్రస్థానం ఇలా..

  • 1962 – మార్గదర్శి చిట్స్ ఏర్పాటు చేశారు
  • 1965 – కిరణ్‌ యాడ్స్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ప్రారంభం
  • 1967 – వసుంధర ఫెర్టిలైజర్స్ వ్యాపారం
  • 1969 – అన్నదాత పత్రిక
  • 1970 – ఇమేజెస్ అవుట్ డోర్ అడ్వర్టైజ్‎మెంట్ ఏజెన్సీ
  • 1971 – డాల్విన్ హూటల్స్ ప్రారంభం
  • 1972 – ఈనాడు వార్తా పత్రిక

మీడియా రంగంలో..

ఆ తరువాత ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి షోరూం, ఈటీవీ2, ఈటీవీ కన్నడ, ఈటీవీ మరాఠీ, ఈటీవీ ఉర్ధూ, ఈటీవీ బెంగాలి, ఈటీవీ ఒరియా, ఈటీవీ గుజరాతీ, ఈటీవీ బీహార్, ఈటీవీ2, ఈటీవీ భారత్ ఇలా అనేక రంగాల్లో తనదైన ప్రతిభను కనబరిచారు.

సినిమా రంగంలో నిర్మించిన చిత్రాలు..

  • శ్రీవారికి ప్రేమలేఖలు
  • మయూరి
  • మౌన పోరాటం
  • ప్రతిఘటన
  • మెకానిక్ మామయ్య
  • ఇష్టం
  • నువ్వే కావాలి
  • ఆనందం
  • ఆకాశ వీధిలో
  • నిన్ను చూడాలని
  • వీధి
  • నచ్చావులే
  • నిన్ను కలిశాక

అవార్డులు, సన్మానాలు..

  • ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, శ్రీశ్రీ రవిశంకర్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్
  • యుధవీర్ అవార్డు
  • బి.డి. గోయెంకా అవార్డు
  • పద్మ విభూషణ్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్