దండకారణ్యంలో వినూత్న ప్రయోగం.. భారీ రోప్ వే నిర్మాణం ఎందుకంటే..
మావోయిస్టుల ఏరివేత దిశగా కేంద్ర బలగాలు చర్యలు చేపట్టాయి. తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సరిహద్దులోని చింతవాగుపై భారీ రోప్‌వే నిర్మించి జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకొనే దిశగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం కేంద్రంగా పావులు కదుపుతున్నాయి. మావోయిస్టుల ఎత్తుగడను చెక్ పెట్టేలా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కేంద్ర బలగాలు నిఘా పెంచాయి. అత్యంత మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన పామెడు దండకారణ్యంలో CRPF అధ్వర్యంలో చింతవాగుపై భారీ రోప్‌వే ను నిర్మించారు.
మావోయిస్టుల ఏరివేత దిశగా కేంద్ర బలగాలు చర్యలు చేపట్టాయి. తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సరిహద్దులోని చింతవాగుపై భారీ రోప్‌వే నిర్మించి జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకొనే దిశగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం కేంద్రంగా పావులు కదుపుతున్నాయి. మావోయిస్టుల ఎత్తుగడను చెక్ పెట్టేలా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కేంద్ర బలగాలు నిఘా పెంచాయి. అత్యంత మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన పామెడు దండకారణ్యంలో CRPF అధ్వర్యంలో చింతవాగుపై భారీ రోప్‌వే ను నిర్మించారు. రోప్‌వే ద్వారా వర్షాకాలంలో అటవీప్రాంతంలో జల్లెడ పట్టనున్నారు. కేంద్ర బలగాల రాకపోకలకు అంతరాయం కలగకుండా మావోయిస్టుల ఏరివేతకు ఎటువంటి ఆటంకం కలగకుండా రోప్ వేను ఏర్పాటు చేశారు. రెండు వందల మీటర్ల పొడవునా భారీ రోప్ వే నిర్మాణంతో భద్రతా బలగాల రాకపోకలు సాగించనున్నాయి. భారీ రోప్‌వే ఏర్పాటుతో స్థానిక ఆదివాసీల సమస్యలు తొలగిపోనున్నాయి.
అంతకుముందు తెలంగాణ సరిహద్దు నుండి 20 కిలోమీటర్లు ఉండే ఈ చింతవాగు కీకారణ్యం అవతల ఉన్న గ్రామాలన్నీ వర్షాకాలంలో ద్వీపకల్పంలో ఉండేవి. రోప్ వే నిర్మాణంతో ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర సరిహద్దు దండకారణ్యం కేంద్రంగా మావోయిస్టులు పాచికలు వేస్తుంటే.. అవి పారకుండా కేంద్ర బలగాలు కొత్త పథకాలను రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే మావోయిస్టుల ఏరివేతకు ఇప్పటకే ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా దశలవారీగా ఆపరేషన్ ప్రహార్ అమలుచేస్తు్న్నారు. మావోయిస్టుల ఉనికిని సమూలంగా రూపుమాపేందుకు కొత్త పంథాలో దండకారణ్యాన్ని ఆపరేషన్ సూర్యశక్తి అమలు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇటీవల కాలంలో భద్రతా బలగాలను టార్గెట్ చేస్తూ అనేక విధ్వంసకర చర్యలకు పాల్పడ్డడంతో ఈ వ్యవహారాలను తిప్పికొట్టేందుకే ఆపరేషన్ ప్రహార్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. కేంద్ర పారా మిలటరీ బలగాలతో దండకారాణ్యాన్ని జల్లెడపడుతున్నాయి. ఆయుధ తయారీ కర్మాగారాలను ధ్వంసం ఇప్పటికే పలువురు మావోయిస్టులను హతమార్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..