Fish Prasadam: చేప మందు ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం.. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు భారీగా చేరుకుంటున్న అస్తమా బాధితులు..
శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఎగ్జిబిషన్ మైదానంలో, అనంతరం కవాడీగూడ, దూద్బౌలిలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. 180 ఏళ్లుగా బత్తిని కుటుంబం ఏటా మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తుండడం విశేషం. మరోవైపు చేప ప్రసాదాన్నితీసుకునేందుకు తెలంగాణ, ఏపీ, రాజస్థాన్, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి వచ్చే వేలాది మంది ఉబ్బసం వ్యాధిగ్రస్థులకు ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకుంటున్నారు.
మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు తరతరాలుగా అందిస్తున్న చేప ప్రసాదం కోసం లక్షలాదిమంది ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకున్నారు . ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా అవసరమైన మందును బత్తిని సోదరులు సిద్ధం చేశారు. సుమారు ఆరు లక్షల మందికి సరిపడా చేప ప్రసాదం మందును సిద్ధం చేశామని బత్తిని అమర్నాథ్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఎగ్జిబిషన్ మైదానంలో, అనంతరం కవాడీగూడ, దూద్బౌలిలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. 180 ఏళ్లుగా బత్తిని కుటుంబం ఏటా మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తుండడం విశేషం.
మరోవైపు చేప ప్రసాదాన్నితీసుకునేందుకు తెలంగాణ, ఏపీ, రాజస్థాన్, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి వచ్చే వేలాది మంది ఉబ్బసం వ్యాధిగ్రస్థులకు ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకుంటున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన షెడ్లలో ఉంటున్నారు. వారికి స్వచ్ఛంద సంస్థలు భోజనం, అల్పాహారం, తాగునీరు అందిస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే చేప ప్రసాదం కోసం వచ్చామని అయితే ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సరిపోలేదని ఆరోపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..