Destinations of India: మన దేశంలో ఈ ప్రదేశాలు వెరీ వెరీ స్పెషల్. మరో ప్రపంచంలో అడుగుపెట్టిన అనుభుతినిస్తాయి.. ఒక్కసారి వెళ్లి చూడండి
ఇక నుంచి ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు ఆ మిస్టరీ ప్లేసెస్ కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి. ఈ రహస్య ప్రదేశాల గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. దీని కారణంగా ఇక్కడ ఇంకా పర్యాటకుల రద్దీ ఉండదు. ప్రయాణాలను ఇష్టపడే వ్యక్తులు.. కొత్త ప్రదేశాలను అన్వేషించి.. థ్రిల్లింగ్ అనుభవాలను పొందాలనుకునే వారికీ ఈ మిస్టరీ ప్లేసెస్ బెస్ట్ ఛాయిస్. ఎవరైనా ఈ ప్రదేశాలకు వెళ్లాలని ట్రిప్‌ని ప్లాన్ చేసుకుంటుంటే.. ఈ రోజు ఈ అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
ప్రపంచవ్యాప్తంగా మర్మమైన ప్రదేశాలు అనేక ఉన్నాయి, వీటిని చూసిన తర్వాత మన కళ్లను మనమే నమ్మడం కష్టం. భారతదేశంలో కూడా ఇలాంటి రహస్య ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి భూమిపై మరొక ప్రపంచంలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ఈ ప్రదేశాలు మిమ్మల్ని ఒక్కసారైనా ఆలోచించేలా చేస్తాయి. ఇప్పటి వరకు ఇలాంటి ప్రదేశాలను సందర్శించకుంటే.. ఇక నుంచి ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు ఆ మిస్టరీ ప్లేసెస్ కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి.
ఈ రహస్య ప్రదేశాల గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. దీని కారణంగా ఇక్కడ ఇంకా పర్యాటకుల రద్దీ ఉండదు. ప్రయాణాలను ఇష్టపడే వ్యక్తులు.. కొత్త ప్రదేశాలను అన్వేషించి.. థ్రిల్లింగ్ అనుభవాలను పొందాలనుకునే వారికీ ఈ మిస్టరీ ప్లేసెస్ బెస్ట్ ఛాయిస్. ఎవరైనా ఈ ప్రదేశాలకు వెళ్లాలని ట్రిప్‌ని ప్లాన్ చేసుకుంటుంటే.. ఈ రోజు ఈ అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
యానా గుహలు
ఇప్పటికి వరకూ ఎక్కువగా అజంతా లేదా ఎల్లోరా గుహల గురించి వినే ఉంటారు. అయితే ఇలాంటి గుహలు కర్ణాటకలో కూడా ఉన్నాయి. ఇవి యానా గుహల పేరుతో ప్రసిద్ధి చెందాయి, ఈ గుహలు నలుపు రంగు సున్నపురాయితో నిర్మించబడ్డాయి. ఇక్కడ ఉన్న రాళ్ల నిర్మాణం మనసును కదిలిస్తుంది. కుమటా అడవుల మధ్యలో ఉన్న ఈ అద్భుతమైన గుహలు 390 అడుగుల ఎత్తులో ఉన్నాయి.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
View this post on Instagram
మాగ్నెటిక్ హిల్
లడఖ్‌లోని మాగ్నెటిక్ హిల్ ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఇక్కడ గురుత్వాకర్షణ ప్రభావం కనిపించదు. కనుక ఈ కొండను మాగ్నెటిక్ హిల్ అని అంటారు. ఇక్కడ రోడ్డుపై వెళ్లే వాహనాలు కిందకు వెళ్లకుండా పైకి రావడం ప్రారంభిస్తాయి. గురుత్వాకర్షణకు సంబంధించిన సంఘటనలు చూసిన తర్వాత.. ఇది నిజమేనా అని అనుకుంటారు. చూసిన తర్వాత నమ్మకుండా ఉండలేరు
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
View this post on Instagram
స్పితి వ్యాలీ
స్పితి వ్యాలీని హిమాచల్ ప్రదేశ్ లోని చల్లని ఎడారి అని పిలుస్తారు. ఇక్కడ చాలా ప్రత్యేకమైన శైలిలో నిర్మించిన గృహాలను చూడవచ్చు. స్పితి వ్యాలీ సముద్ర మట్టానికి 12,500 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడికి వెళ్లడం వల్ల స్వర్గంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇక్కడి అందం కళ్లకు హాయిగా.. మనసుకి ప్రసాంతంగా ఉంటుంది.
రాన్ ఆఫ్ కచ్
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు ఎడారి. ఈ ప్రదేశం చూపరులకు మంచి అనుభూతిని ఇస్తుంది. అద్భుతమైన ఈ ప్రదేశానికి వెళ్లడం వల్ల ప్రపంచమంతా తెల్లగా కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళడానికి ఉత్తమ సమయం రన్ ఉత్సవం. ఈ సమయంలో ఇక్కడి సంస్కృతిని ముఖాముఖిగా చూడగలుగుతారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..