Jilledu Plant: ఈ మొక్క ఎక్కడ దొరికినా ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి..
ఆయుర్వేదంలో అనేక మొక్కల్ని అనేక వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కల్ని.. పలు అనారోగ్య, దీర్ఘకాలిక సమస్యల్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఈ మొక్కలు ఒక రకంగా చెప్పాలంటే వరం లాంటివి. వీటిల్లోకి జిల్లేడు మొక్క కూడా చేరుతుంది. సాధారణంగా ఈ మొక్కల్ని పూజలు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎన్నో రకాల అనారోగ్య..
ఆయుర్వేదంలో అనేక మొక్కల్ని అనేక వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కల్ని.. పలు అనారోగ్య, దీర్ఘకాలిక సమస్యల్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఈ మొక్కలు ఒక రకంగా చెప్పాలంటే వరం లాంటివి. వీటిల్లోకి జిల్లేడు మొక్క కూడా చేరుతుంది. సాధారణంగా ఈ మొక్కల్ని పూజలు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్ని తగ్గించడానికి వాడుతూ ఉంటారు. కీళ్ల నొప్పులు, దంత సమస్యలు, విరేచనాలు, మలబద్ధకం వంటి వాటి నుండి రక్షిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలు ఉన్నాయి. గాయాల్ని త్వరగా నయం చేయడానికి కూడా ఈ మొక్క యూజ్ అవుతుంది. ఈ మొక్కతో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
తలనొప్పి:
తలనొప్పిని తగ్గించడంలో జిల్లేడు మొక్క అద్భుతంగా పని చేస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు. జిల్లేడు ఆకుల్ని మొత్తగా గ్రైండ్ చేసి.. దీని పేస్ట్‌ని నుదిటిపై రాయండి. వీటిల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండటం వల్ల తలనొప్పి, వాపు, ఎరుపు, చికాకు తగ్గుతాయి.
చర్మ ఇన్ ఫెక్షన్లు తగ్గుతాయి:
చర్మంపై దురదలు రావడం, తామర వంటి సమస్యలను తగ్గించడంలో కూడా జిల్లేడు ఆకు బాగా పని చేస్తుంది. జిల్లేడు ఆకుల పేస్టును మీకు దురద, తామర వచ్చిన ప్రదేశంలో రాసుకోండి. అంతే కాకుండా అనేక రకాల చర్మ ఇన్ఫెక్షన్లు పెరగకుండా సహాయ పడుతుంది.
పైల్స్ తగ్గుతాయి:
పైల్స్ సమస్యకి కూడా జిల్లేడు చెట్టు ఆకులు అద్భుతంగా పని చేస్తాయి. జిల్లేడు చెట్టు ఆకుల్ని పేస్టుల చేసి.. పైల్స్ గాయంపై తరచూ పెట్టాలి. ఇలా చేయడం వల్ల గాయం త్వరగా తగ్గుతుంది. నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
కీళ్ల నొప్పులు తగ్గుతాయి:
చాలా మందిలో కీళ్ల నొప్పులు అనేవి సాధారణంగా ఉండే సమస్య. కీళ్ల నొప్పులు అంత త్వరగా తగ్గవు. అందులోనూ పెద్దవారిలో ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటి వారు ఎక్కువ ఖర్చు పెట్టి మందులు కొనడం కంటే.. జిల్లేడు ఆకుల నుంచి తీసిన రసాన్ని తరచూ పూస్తూ ఉంటే త్వరగా ఉపశమనం ఉంటుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)