AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Masala Pasta: మసాలా పాస్తా ఇలా చేశారంటే.. పిల్లలూ, పెద్దలూ ఇష్టంగా తినేస్తారు..

వెరైటీగా తయారు చేసుకునే టిఫిన్స్‌లో మసాలా పాస్తా కూడా ఒకటి. దీన్ని బ్రేక్ ఫాస్ట్, డిన్నర్, స్నాక్స్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇందులో కూరగాయలు. అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు ఉంటాయి కాబట్టి.. శరీరానికి కూడా ఆరోగ్యమే. ఈ మసాలా పాస్తా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే రుచి కూడా చాలా బావుంటుంది. బ్రిటీష్ పాలన సమయంలో ఈ వంటకం బాగా ప్రసిద్ధి చెందింది. పాస్తాను కూరగాయలతో, నాన్ వెజ్‌తో కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే వెజిటేబుల్..

Masala Pasta: మసాలా పాస్తా ఇలా చేశారంటే.. పిల్లలూ, పెద్దలూ ఇష్టంగా తినేస్తారు..
Masala Pasta
Chinni Enni
| Edited By: |

Updated on: Jun 08, 2024 | 11:15 PM

Share

వెరైటీగా తయారు చేసుకునే టిఫిన్స్‌లో మసాలా పాస్తా కూడా ఒకటి. దీన్ని బ్రేక్ ఫాస్ట్, డిన్నర్, స్నాక్స్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇందులో కూరగాయలు. అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు ఉంటాయి కాబట్టి.. శరీరానికి కూడా ఆరోగ్యమే. ఈ మసాలా పాస్తా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే రుచి కూడా చాలా బావుంటుంది. బ్రిటీష్ పాలన సమయంలో ఈ వంటకం బాగా ప్రసిద్ధి చెందింది. పాస్తాను కూరగాయలతో, నాన్ వెజ్‌తో కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే వెజిటేబుల్ మసాలా పాస్తా తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ మసాలా పాస్తాకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం.

మసాలా పాస్తాకు కావాల్సిన పదార్థాలు:

పాస్తా, ఆలివ్ ఆయిల్ లేదా సాధారణ ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, వెల్లుల్లి, అల్లం, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, ఉప్పు, టమాటా సాస్, కొత్తి మీర, బ్రోకలీ, క్యాప్సికమ్, క్యారెట్, టమాటా మీకు ఇష్టమైన కూరగాయలు వేసుకోవచ్చు.

మసాలా పాస్తా తయారీ విధానం:

ముందుగా పెద్ద గిన్నె తీసుకోవాలి. ఇందులో ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి.. పాస్తాను ఉడికించు కోవాలి. ఇవి ఉడికాక ఓ గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు సాస్ పాన్ తీసుకోవాలి. ఇందులో ఆలివ్ ఆయిల్ వేసి వేడెక్కాక.. వెల్లుల్లి, అల్లం తరుగు వేసి వేయించు కోవాలి. ఆ తర్వాత ఉల్లి పాయలు, పచ్చి మిర్చి కూడా వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, నల్ల మిరియాలు వేసి.. ఓ ఐదు నిమిషాల పాటు వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత టమాటా సాస్, మీకు ఇష్టం అయిన ఉడకబెట్టిన కూరగాయలు వేసి.. ఓ పది నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు ఇదంతా దగ్గర పడే సమయంలో కొత్తిమీర వేసి చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కావాలి అనుకుంటే చీజ్ కూడా వేసుకోవచ్చు. అంతే ఎంతో రుచిగా ఉండే మసాలా పాస్తా సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి