Hyderabad: ఇకపై రాత్రిపూట చార్మినార్ అందాలు చూడటం కుదరదు.. అసలు కారణం ఇదే..

హైదరాబాద్ అంటేనే ఎన్నో పర్యాటక ప్రదేశాలకు పెట్టింది పేరు. దేశంలోనే హైదరాబాద్ మహానగరానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో గ్రామాలు, పల్లెల నుంచి కూడా ప్రజలు హైదరాబాద్ నగరంలోని ప్రదేశాలను చూడటానికే ప్రత్యేకంగా వస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ నగరం అనగానే గుర్తుకు వచ్చే చారిత్రక కట్టడం చార్మినార్. అలాంటి ప్రత్యేకత ఉన్న చార్మినార్ చూడటానికి ఇబ్బందులు కలుగుతున్నాయని కొందరు సందర్శకులు వాదిస్తున్నారు.

Hyderabad: ఇకపై రాత్రిపూట చార్మినార్ అందాలు చూడటం కుదరదు.. అసలు కారణం ఇదే..
Hyderabad
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 08, 2024 | 9:49 AM

హైదరాబాద్ అంటేనే ఎన్నో పర్యాటక ప్రదేశాలకు పెట్టింది పేరు. దేశంలోనే హైదరాబాద్ మహానగరానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో గ్రామాలు, పల్లెల నుంచి కూడా ప్రజలు హైదరాబాద్ నగరంలోని ప్రదేశాలను చూడటానికే ప్రత్యేకంగా వస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ నగరం అనగానే గుర్తుకు వచ్చే చారిత్రక కట్టడం చార్మినార్. అలాంటి ప్రత్యేకత ఉన్న చార్మినార్ చూడటానికి ఇబ్బందులు కలుగుతున్నాయని కొందరు సందర్శకులు వాదిస్తున్నారు.

చార్మినార్ ప్రాంతం రోజంతా ఎలా ఉన్నా రాత్రిపూట మాత్రం మరింత అందంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. అలా అనుకునే రోజంతా ఆఫీసు పనుల్లో బిజీగా ఉండే ఉద్యోగులు, చదువుకునే కాలేజీ యువత సైతం రాత్రిపూట చార్మినార్ సందర్శనకు వచ్చి కాసేపు గడిపి వెళ్తారు. కానీ, రానురానూ ఆ అవకాశం లేకుండా చేస్తున్నారని ఇప్పుడు పలువురి వాదన. చీకటిలో చార్మినార్ చూసి సంబరపడదాం అనుకునే కొందరు స్థానికులు, పర్యాటకులు ఆ ఆనందం తమకు దూరం చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు తీవ్రమైన నిరాశ కలుగుతుందని చెబుతున్నారు.

అసలు సమస్య ఏంటంటే.. రాత్రి 11 గంటలు అవగానే చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులను పోలీసులు మూసివేస్తున్నారు. వాహనదారులు రాకుండా ఎక్కడిక్కడ బారికేడ్లు పెట్టి, పోలీసు సిబ్బందిని పెట్టి కాపలా కాస్తున్నారు. కాసేపు అలా చూసి వస్తామని అడిగినా ససేమిరా కుదరదని చెప్పి వెనక్కి పంపించేస్తున్నారు. పగటిపూట ఉద్యోగాల వల్ల రాలేని తాము కాస్త ఇలా రాత్రివేళ కుటుంబాలతో కలిసి ఎంజాయ్ చేద్దామంటే ఇలాంటి చర్యలతో అడ్డుకుంటున్నారని వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

రాత్రి అవ్వగానే చార్మినార్‎తో పాటు పరిసర ప్రాంతాలు సైతం చీకటిలోకి వెళ్లిపోతున్నాయి. రాత్రి 11 గంటలు దాటితే అసలు చార్మినార్‎ని దగ్గర నుంచి చూసే పరిస్థితి కూడా ఉండడం లేదు. అదిగో చార్మినార్ అదే అంటూ దూరం నుంచి చీకటిలో చూసీచూడనట్లు వెళ్లిపోతున్నారు. దానివల్ల ఎంతో ఇష్టంతో వచ్చే తమ ఆశలు ఆవిరి అవుతున్నాయని పలువురు చెబుతున్నారు. పగలు ఇసుకేస్తే రాలనంత జనం ఉండే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఫోటోలు దిగే అవకాశమే ఉండదు.. సరే రాత్రిపూట అయినా వద్దాం అనుకుంటే ఇదీ పరిస్థితి. అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన చార్మినార్ కట్టడం అందాలని లైట్లతో అలంకరించి రాత్రిపూట సందర్శకులకు ఆస్వాదించే అవకాశం కల్పించాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త