Telangana: గుండెపోటుతో ములుగు జడ్పీ చైర్మన్ జగదీష్ కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం..
Kusuma Jagdish passed away: ములుగు జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్ గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం ఉదయం కుసుమ జగదీశ్ కు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Kusuma Jagdish passed away: గుండెపోటు ప్రాణం తీస్తోంది.. ఒకప్పుడు వయసు పైబడిన వారిని మాత్రమే కబళించేది.. ఇప్పుడు.. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు ప్రాణాలు తీసి.. ఆయా కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగుల్చుతోంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న హార్ట్ ఎటాక్ ఘటనలు తీవ్ర ఆందోళనకు దారితీశాయి. తాజాగా.. ములుగు జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్ గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం ఉదయం కుసుమ జగదీశ్ కు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జగదీశ్ తుదిశ్వాస విడిచారు.
కాగా, ములుగు జెడ్పీ చైర్మన్, జిల్లా BRS Party అధ్యక్షుడు కుసుమ జగదీష్ హఠాన్మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా జగదీష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జగదీష్ క్రియాశీల పాత్ర పోషించారని.. ఆయన కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
కుసుమ జగదీష్ మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులతోపాటు.. పలు పార్టీల నాయకులు సంతాపం వ్యక్తంచేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..