Telangana: ‘నాకు టికెట్ ఇవ్వకుంటే నా దారి నేను చూసుకుంటా’.. బీజేపీ సిట్టింగ్ ఎంపీ..
దేశ వ్యాప్తంగా బీజేపీ 195 లోక్ సభ సీట్ల ప్రకటన కాషాయ శ్రేణుల్లో జోష్ నింపింది. తెలంగాణలో 17 సీట్లకుగాను ఏకంగా 9 పార్లమెంట్ సీట్ల ప్రకటనతో ఎన్నికలకు రెడీ అయింది బీజేపీ. అయితే అందరు అనుకున్నట్టే ఆదిలాబాద్ సిట్టింగ్ సీటును పెండింగ్‌లో పెట్టింది అదిష్టానం. సిట్టింగ్ ఎంపి సోయంకు టికెట్ ఇంకా ఖరారు చేయకపోవడంతో ఆ పార్లమెంట్ కాషాయసేనలో హైటెన్షన్ నెలకొంది.

దేశ వ్యాప్తంగా బీజేపీ 195 లోక్ సభ సీట్ల ప్రకటన కాషాయ శ్రేణుల్లో జోష్ నింపింది. తెలంగాణలో 17 సీట్లకుగాను ఏకంగా 9 పార్లమెంట్ సీట్ల ప్రకటనతో ఎన్నికలకు రెడీ అయింది బీజేపీ. అయితే అందరు అనుకున్నట్టే ఆదిలాబాద్ సిట్టింగ్ సీటును పెండింగ్‌లో పెట్టింది అదిష్టానం. సిట్టింగ్ ఎంపి సోయంకు టికెట్ ఇంకా ఖరారు చేయకపోవడంతో ఆ పార్లమెంట్ కాషాయసేనలో హైటెన్షన్ నెలకొంది. ఆదిలాబాద్ హాట్ సీట్ కావడం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు భారీ విజయాన్ని అందుకోవడంతో అందరి చూపును అకర్షిస్తోంది. బీజేపీకి ఈ పార్లమెంట్లో ఓటు బ్యాంక్ భారీగా పెరగడంతో ఏకంగా 42 మంది టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అందుకే ఈ టికెట్‌ను అధిష్టానం హోల్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆరునూరైనా సీటునాదేనని.. గెలిచేది కూడా నేనే అని కుండ బద్దలు కొడుతున్నారు ఆ సిట్టింగ్ ఎంపి.
తనకుటికెట్ రాకుండా రాష్ట్ర కాషాయ అగ్ర నేతలే అడ్డుపడుతున్నారని.. టికెట్ ఇస్తే ఎక్కడ గెలుస్తానో ఎక్కడ కేంద్రమంత్రిని అయిపోతానో అన్న భయం పార్టీ కీలక నేతల్లో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు సోయం బాపురావు. అందుకే మొదటి లిస్ట్‌లో టికెట్ రాకుండా పావులు కదిపారని సంచలనవ్యాఖ్యలు చేశారు. కొమ్మపై ఆధారపడిన పక్షిని కాదు.. రెక్కల మీద ఆధారపడ్డ పక్షిని.. స్వతహాగా ఎగరగలను.. టికెట్ రాకపోతే నా దారి నేను చూసుకుంటా అంటూ హెచ్చరించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు నాదే..గెలిచేది కూడా నేనే.. పార్టీ ఏదనేది అధిష్ఠానం ఆలోచించుకోవాలన్నారు. 2019లోటికెట్ ఇస్తా అంటే పారిపోయిన నేతలే టికెట్ కోసం పోటీపడుతున్నారన్నారు. ఏ బలం లేని సమయంలో నా సొంత బలంతో బీజేపీకి విజయం అందించానన్నారు. జెడ్పీటీసీ లను , ఎంపిపిలను, చివరికి నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించానని తెలిపారు. నా బలం బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుంది.. అందుకే రెండో లిస్ట్‌లో టికెట్ వస్తుందని భావిస్తున్నానన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…



