Modi Tour: రేపు ఆదిలాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రూ.6,697 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

భారతీయ జనతా పార్టీ తొలి జాబితా ప్రకటించిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వస్తున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మార్చి 4, 5 తేదీల్లో సంగారెడ్డి, ఆదిలాబాద్‌లో పర్యటించి సుమారు 7వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మరోవైపు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మోదీ పర్యటన జరుగుతుండటంతో ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం అయ్యాయి.

Modi Tour: రేపు ఆదిలాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రూ.6,697 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
Pm Modi
Follow us

|

Updated on: Mar 03, 2024 | 7:29 AM

భారతీయ జనతా పార్టీ తొలి జాబితా ప్రకటించిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వస్తున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మార్చి 4, 5 తేదీల్లో సంగారెడ్డి, ఆదిలాబాద్‌లో పర్యటించి సుమారు 7వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మరోవైపు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మోదీ పర్యటన జరుగుతుండటంతో ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం అయ్యాయి.

భారత ప్రధాని నరేంద్రమోదీ మార్చి4వ తేదీన ఆదిలాబాద్‌లో పర్యటిస్తున్నారు. 6వేల 697 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్‌ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మోదీ సభ జరిగే ఇందిరా స్టేడియం వైపు రెండు రోజులు రాకపోకలు బంద్‌ చేశారు. కలెక్టరేట్, ఎస్పీ క్యాంప్ ఆఫీసు నుంచి ఆదిలాబాద్ చౌరస్తా వరకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఇవాళ, రేపు రెండు రోజులపాటు పట్టణంలో ఎటువంటి డ్రోన్లకు అనుమతి లేదని చెప్పారు ఎస్పీ ఆలం. మరోవైపు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న క్రమంలో సోమవారం పరీక్షలు రాసే విద్యార్థులు వీలైనంత త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రధాని మోదీ ఆదిలాబాద్ పర్యటన నేపథ్యంలో కచ్ కంటి నుండి ఆదిలాబాద్ పట్టణానికి రాకపోకలను మళ్లించారు పోలీసులు. పాత సాత్నాల రహదారి నుండి ఆదిలాబాద్‌కు దారి మళ్లించారు. కెఆర్‌కె కాలనీ వాసులు పట్టణంలోకి రావడానికి మావల పోలీస్ స్టేషన్ మీదుగా తిరుమల పెట్రోల్ బంక్ వైపు రాకపోకలు సాగించాలని చెప్పారు పోలీసులు. అంకులి, తంతోలి ప్రజలు పట్టణంలోకి రావడానికి కృష్ణా నగర్ మీదుగా మావల పిఎస్ ముందున్న రోడ్డును వాడుకోవాలని సూచన చేశారు. ప్రధాని మోదీ సభకు లక్ష మంది హాజరవుతారని చెప్పారు ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి. మరోసారి ఆదిలాబాద్ సీటును గెలిచి మోదీకి గిఫ్ట్‌గా ఇస్తామని చెప్పారు. మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం రావాడాన్ని స్వాగతిస్తామన్నారు బీజేపీ నేతలు. మోదీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఎంపీ సోయంబాపురావు, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్‌ శంకర్‌ పర్యవేక్షించారు. తెలంగాణ ప్రజలకు పండగని చెప్పిన మహేశ్వర్‌రెడ్డి సభను విజయవంతం చేయాలని కాషాయ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇక మార్చి 5న సంగారెడ్డికి చేరుకునే ప్రధాని అక్కడ కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించి, మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ప్రధాని మార్చి 5వ తేదీ మధ్యాహ్నం 1 గంటలకు బేగంపేట నుంచి భువనేశ్వర్‌కు బయలుదేరుతారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్