Medaram: నా భర్త బెట్టింగ్ మానేయాలి.. మేడారం వనదేవతలకు ఓ భక్తురాలి వింత కోరిక
దేవుడు అంటే భక్తుల కొంగు బంగారం.. గుడికి వెళ్తే చాలు మనసులో ఇష్టమైన కోరికను నెరవేర్చాలంటూ పూజలు, ప్రార్థనలు చేస్తుంటారు భక్తులు. తమ కోరిక నెరవేరితే దేవుడికి మొక్కులు చెల్లించడానికి ఎంతకైనా ఖర్చు పెడుతుంటారు. అయితే కొందరు మంచి ఉద్యోగం రావాలి, మరికొందరు జీవితం లో సెటిల్ అవ్వాలని దేవుళ్లను కోరుకోవడం చాలా కామన్.
దేవుడు అంటే భక్తుల కొంగు బంగారం.. గుడికి వెళ్తే చాలు మనసులో ఇష్టమైన కోరికను నెరవేర్చాలంటూ పూజలు, ప్రార్థనలు చేస్తుంటారు భక్తులు. తమ కోరిక నెరవేరితే దేవుడికి మొక్కులు చెల్లించడానికి ఎంతకైనా ఖర్చు పెడుతుంటారు. అయితే కొందరు మంచి ఉద్యోగం రావాలి, మరికొందరు జీవితం లో సెటిల్ అవ్వాలని దేవుళ్లను కోరుకోవడం చాలా కామన్. కానీ ఓ భక్తురాలు మాత్రం వింత కొరికను కోరుకుంది.
ఇటీవల జరిగిన మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు సమ్మక్క దర్శనం కోసం బారులు తీరారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. డబ్బులు హుండీ వేశారు. అయితే ఓ మహిళ భక్తురాలు హుండీలో వేసిన చిట్టీ అందర్నీ షాక్ కు గురిచేసింది. తన భర్త బెట్టింగ్ మానేయాలని, తన అక్క కొడుకు ఐఐఐటీ సీటు కొట్టాలని ఆ చిట్టీలో రాసింది. హుండీ లెక్కింపు ఈ చిట్టి బయట పడటంతో ఈ వార్త వైరల్ గా మారింది.
తాజాగా సమ్మక్క, సారలమ్మ జాతర హుండీ లెక్కింపు కొనసాగుతుంది. హనుమకొండ లష్కర్‌బజార్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర హుండీలను లెక్కిస్తున్నారు. మూడోరోజు మేడారం హుండీలను లెక్కిస్తే.. 3.46 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు చెప్పారు అధికారులు. ఇప్పటి వరకు 317హుండీల లెక్కించగా.. 9.60కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు చెప్పారు ఈఓ రాజేంద్రం.
ఇక రెండో రోజు శుక్రవారం 2కోట్ల 98 లక్షల35 వేలు ఆదాయం లభించింది. 71 ఐరన్ హుండీల్లోని కరెన్సీ, చిల్లర నాణెలు, వెండి, బంగారం వేరు చేశారు. మొదటిరోజు 3 కోట్ల15 లక్షల 40వేలు ఆదాయం వచ్చింది. మొత్తం మూడు రోజులు కలిపి 9.60కోట్ల రూపాయల ఆదాయం రాగా.. ఈ నగదును బ్యాంకులో జమ చేశామని ఈవో వివరించారు.