AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ ఎంపీ స్థానం మంత్రి శ్రీధర్ బాబుకు అత్యంత కీలకం.. విభేదాల మధ్య ఆసక్తికర రాజకీయం..

పెద్దపల్లి ‌ఎంపి‌ స్థానంలో విజయం సాధించడం మంత్రి శ్రీధర్ బాబుకు అత్యంత కీలకం. అయితే టికెట్ విషయంలో మొదటినుండి కాంగ్రెస్‎లో విభేధాలు ఉన్నాయి. ముఖ్యంగా వివేక్ తనయుడు వంశీకృష్ణకి టికెట్ ఇచ్చే విషయంలో కొంత మంది నేతలు వ్యతిరేకించారు. ఇప్పుడు ‌అన్ని విభేదాలు ప్రక్కన పెట్టి కలిసి పనిచేస్తామని నేతలు చెబుతున్నారు. గెలుపు బాధ్యతలని శ్రీధర్ బాబు తీసుకున్నారు.

Telangana: ఆ ఎంపీ స్థానం మంత్రి శ్రీధర్ బాబుకు అత్యంత కీలకం.. విభేదాల మధ్య ఆసక్తికర రాజకీయం..
Sridhar Babu
G Sampath Kumar
| Edited By: Srikar T|

Updated on: Apr 10, 2024 | 11:53 AM

Share

పెద్దపల్లి ‌ఎంపి‌ స్థానంలో విజయం సాధించడం మంత్రి శ్రీధర్ బాబుకు అత్యంత కీలకం. అయితే టికెట్ విషయంలో మొదటినుండి కాంగ్రెస్‎లో విభేధాలు ఉన్నాయి. ముఖ్యంగా వివేక్ తనయుడు వంశీకృష్ణకి టికెట్ ఇచ్చే విషయంలో కొంత మంది నేతలు వ్యతిరేకించారు. ఇప్పుడు ‌అన్ని విభేదాలు ప్రక్కన పెట్టి కలిసి పనిచేస్తామని నేతలు చెబుతున్నారు. గెలుపు బాధ్యతలని శ్రీధర్ బాబు తీసుకున్నారు.

పెద్దపల్లి ‌పార్లమెంటు‌ స్థానంపై‌ ప్రత్యేక దృష్టి పెట్టింది కాంగ్రెస్. ఇక్కడ టికెట్ కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా ప్రయత్నం చేసారు. అయితే చివరకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తనయుడు వంశీకృష్ణకు టికెట్ దక్కింది. వివేక్, శ్రీధర్ బాబుకు గతంలో విభేదాలు ఉండేవి. తరువాత వివేక్ బిజేపి ‌నుండి కాంగ్రెస్‎లో చేరడంతో కాస్తా ఒక్కటైయ్యారు. అయితే టికెట్ విషయంలో మొదట మంత్రి శ్రీధర్ బాబు సంపూర్ణ మద్దతు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే వివేక్ రంగంలోకి దిగి హైదరాబాదులో‌ పెద్దపల్లి పార్లమెంటు ‌ముఖ్యనేతలతో‌ సమావేశం నిర్వహించారు. అంతే కాకుండా వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తామని మీడియా సమావేశంలో మంత్రి‌ శ్రీధర్ బాబుతో పాటు ఇతర ముఖ్య నేతలు ప్రకటించారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెసే విజయం సాధించింది. దీంతో ఖచ్చితంగా గెలిచే సీటు పెద్దపల్లి ‌అని మొదటినుండి కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది. అయితే అంతర్గత విభేదాల కారణంగా ఏమైనా జరుగుతుందోనన్న భావనతో అధిష్టానం ముఖ్యనేతలని ఐక్యపరిచి దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

మంథని నుండి ప్రాతినిధ్యం ‌వహించే శ్రీధర్‌బాబుకు ఈ పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పారు. ఏడుగురు ఎమ్మెల్యేలు కలిసి కట్టుగా పనిచేపించే బాధ్యతలను శ్రీధర్ బాబు తీసుకున్నారు. దీనితో గెలిపించుకోవడం శ్రీధర్ బాబుకు అత్యంత కీలకం. ఇప్పటి నుండే శ్రీధర్ బాబు పెద్దపల్లి పార్లమెంటు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్కడక్కడా విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించి ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. టికెట్ ఆశించిన వారితో మాట్లాడి కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోరు ఉన్న నేపధ్యంలో ప్రతి ఓటు కూడా అత్యంత కీలకం. ఇప్పటికే అసెంబ్లీల వారిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో సింగరేణి ఓట్లు అధికంగా ఉన్న నేపధ్యంలో వారిని అకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో రామగుండం, బెల్లంపల్లి మంచిర్యాలలలో ఏఐటియూసి తమ అధిక్యతని ప్రదర్శించింది. దీనితో సింగరేణి ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ధేశించనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..