Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress – MIM: ఎంఐఎంతో కాంగ్రెస్‌ దోస్తీ కుదిరింది.. రేవంత్‌రెడ్డి డిసైడ్‌ చేశారు.. ఫిరోజ్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో సై అంటే సై అంటూ తలపడుతున్నాయి.. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆ పార్టీలో చిచ్చు రేపాయి.. ఎంఐఎంతో పొత్తు కుదిరిందంటూ ఆయన బాంబు పేల్చారు..

Congress - MIM: ఎంఐఎంతో కాంగ్రెస్‌ దోస్తీ కుదిరింది.. రేవంత్‌రెడ్డి డిసైడ్‌ చేశారు.. ఫిరోజ్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు
Congress Mim
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 10, 2024 | 12:32 PM

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో సై అంటే సై అంటూ తలపడుతున్నాయి.. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆ పార్టీలో చిచ్చు రేపాయి.. ఎంఐఎంతో పొత్తు కుదిరిందంటూ ఆయన బాంబు పేల్చారు.. అంతేకాకుండా.. ఓ అడుగు ముందుకేసి మరి.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ను గెలిపించాలని పార్టీ హైకమాండ్ ఆదేశించిందంటూ వ్యాఖ్యానించారు.. ఇంకేముంది.. ఇంతకాలం ఉప్పు.. నిప్పులా ఉన్న పార్టీలు.. మళ్లీ ఒక్కటయ్యాయంటూ ఫిరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అటు రాజకీయాల్లో.. ఇటు నెట్టింట వైరల్ గా మారాయి..

కాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ఖాన్‌ ఏమన్నారంటే..

ఎంఐఎంతో కాంగ్రెస్‌ దోస్తీ కుదిరింది.. అసదుద్దీన్‌ను గెలిపించాలని హైకమాండ్‌ ఆదేశించిందంటూ ఫిరోజ్ ఖాన్ పేర్కొన్నారు.రేవంత్‌రెడ్డి కూడా ఇదే డిసైడ్‌ చేశారు.. మా కెప్టెన్‌ ఏం చెప్తే అదే చేస్తాం.. వ్యక్తిగతంగా అసదుద్దీన్‌తో నేను కొట్లాడుతూనే ఉంటా.. పార్టీఆదేశాల మేరకు అతన్ని గెలిపిస్తాం.. అంటూ ఫిరోజ్‌ఖాన్ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Feroz Khan

Feroz Khan

అయితే, కాంగ్రెస్, ఎంఐఎం దోస్తీపై ఇటీవల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం మాటలతో కత్తులు దూసిన నేతలు.. ఇటీవల ప్రశంసలతో ముంచెత్తుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిన తర్వాత.. రేవంత్ రెడ్డి.. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీకి ప్రొటెం స్పీకర్ గా అవకాశమిచ్చారు. అంతేకాకుండా.. బ్రిటన్ లో పర్యటించిన సమయంలో లండన్‌ లో సీఎం రేవంత్‌రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ భేటీ అయ్యారు.. అప్పటి నుంచి ఇరుపార్టీల మధ్య గ్యాప్ తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో, ఇఫ్తార్ వేడుకలో.. సీఎం రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్ ప్రశంసలు కురిపించగా.. ఆయన కూడా అదే రీతిలో ఆయన్ను పొగిడారు.. ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే.. ఇరు పార్టీలు మళ్లీ జత కట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు..

మొత్తం మీద ఫిరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలు చర్చనీయాంశంగా మారాయి.. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..