Bhadrachalam: 10 సంవత్సరాల తర్వాత.. ఎట్టకేలకు భద్రాచలం రెండో వంతెనకు మోక్షం.
భద్రాచలం గోదావరిపై రెండవ బ్రిడ్జికి శంకుస్థాపన చేసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 సంవత్సరాలు అయింది. అప్పటినుంచి వంతెనపనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఈ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరగా పనులు పూర్తి చేసి ఏప్రిల్ 17న జరుగే శ్రీరామనవమి నాటికి రెండవ బ్రిడ్జిపై నుండి రాకపోకలు కొనసాగాలని, పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎట్టకేలకు భద్రాచలం గౌతమి నదిపై రెండో బ్రిడ్జికి మోక్షం కలిగింది. ఈ నదిపై వంతెన నిర్మాణపనులు ప్రారంభించిన పదేళ్ల తర్వాత వంతెన నిర్మాణం పూర్తి చేసుకొని అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. పదేళ్లపాటు సాగిన బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసుకొని శ్రీరామనవమి నాడు బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. భద్రాచలం గోదావరిపై రెండవ బ్రిడ్జికి శంకుస్థాపన చేసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 సంవత్సరాలు అయింది. అప్పటినుంచి వంతెనపనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఈ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరగా పనులు పూర్తి చేసి ఏప్రిల్ 17న జరుగే శ్రీరామనవమి నాటికి రెండవ బ్రిడ్జిపై నుండి రాకపోకలు కొనసాగాలని, పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశంతో యుద్ధ ప్రాతిపదికన వంతెన పనులు చేపట్టారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో ఇక ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది.
నాలుగు రాష్ట్రాలకు భద్రాచలం కేంద్ర బిందువు కావడంతో రాకపోకలతో పాటు ఆయా రాష్ట్రాల నుండి భారీ లోడులతో వెళ్లే వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో గోదావరి నదిపై రెండవ బ్రిడ్జి నిర్మాణం అవశ్యకత ఏర్పడింది. గోదావరి నదిపై 1.2 కిలోమీటర్ల పొడవునా 65 కోట్ల వ్యయంతో 37 పిల్లర్లతో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరుగబోయే శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకానికి వచ్చే భక్తులతో పాటు , వాహన దారులకు ట్రాఫిక్ సమస్యలనుంచి ఉపశమనం కలగనుంది. శ్రీరామ నవమి సందర్భంగా ముందుగా వాహనాల రాకపోకలకి అనుమతి ఇచ్చి..ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ప్రజా ప్రతినిధులచే అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఎట్టకేలకు ఇటు భక్తులు , అటు ఏజెన్సీ వాసుల కల నెరవేరింది..గోదావరి పై నిర్మించిన రెండవ వారథి అందుబాటులోకి వచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.