Boat Accident: తీవ్ర విషాదం.. ప‌డ‌వ‌ మునిగి 90 మంది జ‌ల స‌మాధి.! ఎక్కడంటే.?

ఆఫ్రికా దేశం మొజాంబిక్ తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేప‌ల వేట‌కు వెళ్లి ప్రమాద‌వ‌శాత్తూ ప‌డ‌వ మునిగిపోవడంతో 90 మందికి పైగా జ‌ల స‌మాధి అయ్యారు. కాగా, ప్రమాద స‌మ‌యంలో ప‌డ‌వ‌లో 130 మంది వ‌ర‌కు ఉన్నట్లు స‌మాచారం. బోటు సామ‌ర్థ్యానికి మించి ప్రయాణించ‌డంతోనే ఈ దుర్ఘట‌న జ‌రిగింద‌ని అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల్లో అధిక సంఖ్య‌లో పిల్లలు ఉన్నట్టు స్థానిక అధికారులు పేర్కొన్నారు.

Boat Accident: తీవ్ర విషాదం.. ప‌డ‌వ‌ మునిగి 90 మంది జ‌ల స‌మాధి.! ఎక్కడంటే.?

|

Updated on: Apr 10, 2024 | 8:24 AM

ఆఫ్రికా దేశం మొజాంబిక్ తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేప‌ల వేట‌కు వెళ్లి ప్రమాద‌వ‌శాత్తూ ప‌డ‌వ మునిగిపోవడంతో 90 మందికి పైగా జ‌ల స‌మాధి అయ్యారు. కాగా, ప్రమాద స‌మ‌యంలో ప‌డ‌వ‌లో 130 మంది వ‌ర‌కు ఉన్నట్లు స‌మాచారం. బోటు సామ‌ర్థ్యానికి మించి ప్రయాణించ‌డంతోనే ఈ దుర్ఘట‌న జ‌రిగింద‌ని అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల్లో అధిక సంఖ్య‌లో పిల్లలు ఉన్నట్టు స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఫెర్రీని చేప‌ల ప‌డ‌వ‌గా మార్చి అధిక సంఖ్యలో ప్రయాణించ‌డంతోనే ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ దుర్ఘట‌న గురించి తెలుసుకున్న అధికారులు వెంట‌నే ఘ‌ట‌నాస్థలికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టారు. అయితే ఘటనపై అధికారులు చెబుతున్న కోణం మరోలా ఉంది. దేశంలో క‌ల‌రా వ్యాప్తి అంటూ వ‌దంతుల నేప‌థ్యంలో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజ‌లు త‌ప్పించుకుని దీవుల్లోకి వెళ్తున్నట్లు నాంపుల ప్రావిన్స్ సెక్రట‌రీ జైమ్ నెటో వెల్లడించారు. ఇలా వెళ్తుండ‌గా ఈ ప‌డ‌వ మునిగింద‌ని తెలిపారు. మొజాంబిక్ దేశంలో గ‌తేడాది అక్టోబ‌ర్ నుంచి ఇప్పటివ‌ర‌కూ 15 వేల క‌ల‌రా కేసులు న‌మోదైన‌ట్లు, 32 మంది మ‌ర‌ణించిన‌ట్లు అధికారిక గణాంకాలను బట్టి తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
Latest Articles