Peddapalli Politics: పెద్దపల్లి రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌.. ఇంతకీ పెద్దపల్లి పాలిటిక్స్‌లో అసలేం జరిగింది..?

నామినేషన్లు పూర్తయ్యాక అభ్యర్థి ఎవరన్న అనుమానముంటుందా? కానీ అక్కడ బీజేపీ క్యాండేట్‌ నామినేషన్‌ వేసినా బరిలో ఉండేదెవరన్నది సస్పెన్సే. బీఫాంలో ఇద్దరి పేర్లతో.. విత్‌డ్రా తర్వాత కానీ పోటీలో ఉండేదెవరో తేలేలా లేదు. ఈ గొడవ చాలదన్నట్లు వర్గ విభేదాలతో పార్టీకి కొత్త తల నొప్పులు తెచ్చిపెడుతున్నారు నేతలు. చివరికి అంతా ఓ మాటమీదికొస్తారా? నిండా మునిగాక చలేముందనుకుంటారా?

Peddapalli Politics: పెద్దపల్లి రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌.. ఇంతకీ పెద్దపల్లి పాలిటిక్స్‌లో అసలేం జరిగింది..?
BJP
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 28, 2024 | 10:49 AM

నామినేషన్లు పూర్తయ్యాక అభ్యర్థి ఎవరన్న అనుమానముంటుందా? కానీ అక్కడ బీజేపీ క్యాండేట్‌ నామినేషన్‌ వేసినా బరిలో ఉండేదెవరన్నది సస్పెన్సే. బీఫాంలో ఇద్దరి పేర్లతో.. విత్‌డ్రా తర్వాత కానీ పోటీలో ఉండేదెవరో తేలేలా లేదు. ఈ గొడవ చాలదన్నట్లు వర్గ విభేదాలతో పార్టీకి కొత్త తల నొప్పులు తెచ్చిపెడుతున్నారు నేతలు. చివరికి అంతా ఓ మాటమీదికొస్తారా? నిండా మునిగాక చలేముందనుకుంటారా? ఏకంగా రోడ్డెక్కి నానా రభస సృష్టించారు.

తెలంగాణలో ఓవైపు మెజారిటీ ‌స్థానాలలొ విజయం‌ సాధించేందుకు భారతీయ జనతా పార్టీ వ్యూహన్ని రూపొందిస్తుంటే, ఇక్కడ మాత్రం నేతలు ఘర్షణకి దిగుతున్నారు. వర్గ విబేధాలతో మరిన్ని సమస్యలను తెరపైకి వస్తున్నాయి. స్వయంగా బీజేపీ రాష్ట్ర ‌సంఘటన‌ కార్యదర్శి చంద్రశేఖర్ జోక్యం‌ చేసుకునే‌ పరిస్థితి నెలకొంది. అయినా నేతల తీరు‌ మాత్రం మారడం లేదు.

పెద్దపల్లి ‌పార్లమెంటు‌ స్థానంలో బీజేపీ విభేధాలు మరింత‌ ముదిరిపోయాయి. చివరకు బహిరంగంగా కొట్టుకునేంత వరకు వెళ్ళింది. పరస్పరం నేతలూ, కార్యలర్తలు వీధి పోరాటానికి దిగుతున్నారు. చివరకు రాష్ట్ర నాయకత్వం కూడా జోక్యం చేసుకున్నా, నాయకుల వ్యవహార‌శైలీ మారడం లేదు. బీజేపీ రెండవ జాబితాలోనే కాంగ్రెస్ ‌నుండి‌ వచ్చిన‌ గోమాస శ్రీనివాస్ ‌పేరును‌ ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. బీజేపీలో పలువురు నేతలు‌ టికెట్ ఆశించినప్పటికీ ‌శ్రీనివాస్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. అధిష్టానం అంచనాలకు అణుగుణంగా ప్రచారం చేయలేక పోతున్నారు శ్రీనివాస్. ఈ క్రమంలో అభ్యర్థిని మార్చుతారంటూ ప్రచారం ఊపందుకుంది.

కానీ, .ఎలాంటి మార్పు చేయలేదు. గోమాస శ్రీనివాస్ ను ప్రచార స్పీడ్ ను పెంచాలని అధిష్టానం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే నామినేషన్ల ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ పెద్దపల్లి ఇంచార్జీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో నడిరోడ్డులోనే ఒకరినొకరు తన్నుకున్నారు. కాగా, ఇక్కడ నాలుగైదు గ్రూపులు బీజేపీలో కొనసాగుతున్నాయి. కొత్త, పాత నేతల మధ్యన రోజురోజుకీ గ్యాప్ ఏర్పడుతోంది. నామినేషన్ ర్యాలీలో‌ కూడా కొంత మంది‌ సీనియర్ నేతలు దూరంగా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డి నియామాకాన్ని కూడా అప్పట్లో పలువురు వ్యతిరేకించారు.

మరోవైపు ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రచారాన్ని స్పీడప్ చేశారు. కానీ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ‌మాత్రం ప్రచారంలో దూకుడు పెంచలేక పోతున్నారు. ఇప్పటికే ఈయన వ్యవహార శైలి పైనా రాష్ట్ర నాయకత్వం అసంతృప్తిగా‌ ఉందట. దానికి తోడు‌ ఇక్కడి నేతల ‌విబేధాల కారణంగా మొదటికే మోసం వస్తుందన్న భయం బీజేపీకి పట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా ఈ నియోజకవర్గంలో కొంత‌ ప్రభావం ఉన్న నేతల కారణంగా ఓటర్ల దగ్గరికి వెళ్ళలేకపొతున్నారు. పెద్దపల్లిలో‌ బీజేపీ రాష్ట్ర సంఘటన‌ కార్యదర్శి చంద్రశేఖర్ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గత పదిహేను రోజులుగా ప్రచార తీరు నివేదిక‌ ఇవ్వాలంటూ ఇంచార్జీలకి ఆదేశాలు ఇచ్చారు. చంద్రశేఖర్ జోక్యంతో‌ ఈ‌సమస్య సద్దుమణుగుతుందని కొంతమంది ‌నేతలు చెబుతున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం వర్గాల వారిగా పోస్టింగ్ లు పెడుతున్నారు. క్యాడర్ పనిచేసేందుకు ముందుకు వస్తున్న నేతల తీరుతో పెద్దపల్లి బీజేపీలో అయోమయం నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…