AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mallareddy: మల్లన్న కొంపముంచిన ఈటలతో సరదా.. ప్రత్యర్థులకు పొలిటికల్ అస్త్రంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్..

ఆయన ఏం మాట్లాడినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఆయన కామెంట్స్‌ను అంతా తెగ ఎంజాయ్ చేసేవాళ్లు. అలాంటి ఆ నాయకుడు.. ఇప్పుడు తన కామెంట్స్‌తో సొంత పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రత్యర్థులకు కొత్త అస్త్రంగా మారిపోయారు.. మల్లారెడ్డి.. ఉరఫ్ మాస్ మలన్న. ఎంపీగా ఉన్నా.. మంత్రి పదవి చేపట్టినా.. మలన్న స్టయిల్ మాత్రం అస్సలు మారదు..

Mallareddy: మల్లన్న కొంపముంచిన ఈటలతో సరదా.. ప్రత్యర్థులకు పొలిటికల్ అస్త్రంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్..
Malla Reddy, Etela Rajender
Shaik Madar Saheb
|

Updated on: Apr 28, 2024 | 10:44 AM

Share

ఆయన ఏం మాట్లాడినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఆయన కామెంట్స్‌ను అంతా తెగ ఎంజాయ్ చేసేవాళ్లు. అలాంటి ఆ నాయకుడు.. ఇప్పుడు తన కామెంట్స్‌తో సొంత పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రత్యర్థులకు కొత్త అస్త్రంగా మారిపోయారు.. మల్లారెడ్డి.. ఉరఫ్ మాస్ మలన్న. ఎంపీగా ఉన్నా.. మంత్రి పదవి చేపట్టినా.. మలన్న స్టయిల్ మాత్రం అస్సలు మారదు. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ ప్రెస్‌మీట్‌లో తొడగొట్టినా.. అది మల్లన్నకే సాధ్యం. మా మల్లారెడ్డి ఇంతే అని బీఆర్ఎస్ నేతలు అంటుంటారు. ఆయన చాలా జోవియల్ అని స్వయంగా గులాబీ బాస్ కేసీఆరే అనేశారు. దీంతో మల్లారెడ్డి సరదాలను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. మల్లన్న మాట్లాడినా.. స్టెప్పులేసినా.. అంతా సరదా సరదాగా సాగిపోయింది. అయితే అలాంటి మల్లారెడ్డి మాటలు ఇప్పుడు బీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారిపోవడం హాట్ టాపిక్‌ అయింది.

ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌, మల్లారెడ్డి కలిశారు. ఇద్దరూ ఒకప్పుడు సహచర మంత్రులు, పరిచయం ఉన్నవాళ్లు కావడంతో అప్యాయంగా పలకరించుకున్నారు. ఇంతవరకు ఓకే. కానీ ఇంతవరకే పరిమితమైతే.. ఆయన మల్లారెడ్డి ఎందుకు అవుతారు. అందుకే తన ఇక్కడ కూడా తన ట్రేడ్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రదర్శించారు. బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌ను.. అన్నా నువ్వే గెలుస్తావ్ అనేశారు.

అయితే అన్నీ సార్లు సరదాలు సరదాగానే సాగిపోవు కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. బీఆర్ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం పని చేయాల్సిన మల్లారెడ్డి..బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలుస్తావని అనడం ఏంటని సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. బీఆర్ఎస్‌కు ఇది ఇరకాటంలో పడేసింది. దీంతో రంగంలోకి దిగిన బీఆర్ఎస్ నాయకత్వం.. దీనిపై క్లారిటీ ఇవ్వాలని మల్లారెడ్డిని ఆదేశించింది. దీంతో ఈ ఎపిసోడ్‌పై వివరణ ఇచ్చిన మల్లారెడ్డి.. జస్ట్ ఫ్రెండ్‌షిప్‌లో మాత్రమే గెలుస్తున్నావని ఈటలతో చెప్పానని అన్నారు. తన వ్యాఖ్యలను కావాలనే వైరల్ చేస్తున్నారని చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్‌తో..

మామూలుగా అయితే మల్లారెడ్డి సరదాగా ఎపిసోడ్‌కు ఇక్కడితో ఫుల్‌స్టాప్‌ పడిపోవాలి. కానీ ఈసారి ఏకంగా దీనిపై సీఎం రేవంత్ రె్డి రియాక్ట్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్‌ ఒక్కటే అనడానికి మల్లారెడ్డి, ఈటల సంభాషణే నిదర్శనమన్నారు. బీజేపీతో చీకటి ఒప్పందం లేకపోతే ఎమ్మెల్యే మల్లారెడ్డిపై బీఆర్ఎస్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మల్లారెడ్డి వ్యూహం ఇదే.. కేటీఆర్

అయితే మ‌ల్లారెడ్డి కామెంట్స్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రియాక్ట్‌ అయ్యారు. త‌న రాజ‌కీయం అనుభవంతోనే ఈట‌ల‌పై అలాంటి వ్యాఖ్యలు చేశారని.. ఈట‌ల రాజేంద‌ర్‌ను మున‌గ చెట్టు ఎక్కించి కింద ప‌డేయాల‌నేది మ‌ల్లారెడ్డి వ్యూహ‌మ‌ని చెప్పారు. ఈ విష‌యంలో మ‌ల్లారెడ్డి త‌న రాజ‌కీయ అనుభ‌వాన్ని చాటుకున్నార‌ని చెప్పారు. ఆయన మాటల్లో అంతరార్థం తెలియక కొంతమంది ఆగమవుతున్నారని కామెంట్ చేశారు. మల్లారెడ్డిని కేటీఆర్ ఇప్పుడు వెనకేసుకొచ్చినా.. ఇట్ల మాట్లాడి పార్టీని పరేషాన్ చేయకే మల్లన్న అని స్వీట్ వార్నింగ్ ఇచ్చి ఉంటారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..