AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ స్థానం గెలుపు ఓటములపై ఉత్కంఠ.. కాయ్ రాజా కాయ్ అంటున్న బెట్టింగ్ రాయుళ్ళు!

కరీంనగర్ ‌పార్లమెంటు వైపే అందరి‌ దృష్టి పడింది. ఇక్కడి ముఖ్యనేతలు బరిలో ఉండడంతో ఫలితంపై అసక్తి ఎర్పడింది. దీంతో పెద్ద ఎత్తున బెట్టింగ్‌ల జోరు అందుకుంది. భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని బెట్టింగ్ కాసే వారి సంఖ్య ఎక్కువగా ఉందట. ఇక్కడ ‌మాత్రం బీఅర్ఎస్ పోటీ గురించి ఎవరూ పట్టించుకోవటం లేదట.

Telangana: ఆ స్థానం గెలుపు ఓటములపై ఉత్కంఠ.. కాయ్ రాజా కాయ్ అంటున్న బెట్టింగ్ రాయుళ్ళు!
Telangan Betting
G Sampath Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Jun 02, 2024 | 1:37 PM

Share

కరీంనగర్ ‌పార్లమెంటు వైపే అందరి‌ దృష్టి పడింది. ఇక్కడి ముఖ్యనేతలు బరిలో ఉండడంతో ఫలితంపై అసక్తి ఎర్పడింది. దీంతో పెద్ద ఎత్తున బెట్టింగ్‌ల జోరు అందుకుంది. భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని బెట్టింగ్ కాసే వారి సంఖ్య ఎక్కువగా ఉందట. ఇక్కడ ‌మాత్రం బీఅర్ఎస్ పోటీ గురించి ఎవరూ పట్టించుకోవటం లేదట. మరికొన్ని గంటలలో ఫలితాలు రానున్న నేఫధ్యంలో నేతలల్లో ఉత్కంఠ నెలకొంది. అంతే కాకుండా మూడు పార్టీ ల రాష్ట్ర నాయకత్వం కూడ కరీంనగర్ ఫలితం పైనె ఆసక్తి ‌కనబరుస్తుంది.

కరీంనగర్ పార్లమెంటు స్థానం రాష్ట్రంలో ‌కీలక స్థానంగా మారింది. ఇక్కడ మూడు పార్టీలకు గెలుపు ఎంతో కీలకం. ఉద్యమ‌ సమయంలో బీఅర్ఎస్‌ను కాపాడింది ఈ ప్రాంతమే. బీజేపీకి అండగా నిలిచింది కూడా కరీంనగరే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కి మెజారిటీ స్థానాలు అప్పజెప్పింది ఇక్కడి ఓటర్లే. అంతేకాకుండా ఇక్కడ బలమైనా అభ్యర్థులు బరిలో ఉండడంతో పోరు‌ కూడా మరింత ఆసక్తి రేపుతుంది.

భారతీయ జనతా పార్టీ తరుఫున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, బీఅర్ఎస్ నుండి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుండి వెలిచాల రాజేందర్ రావు పోటి పడున్నారు. ప్రచార సమయంలో ఎవరూ‌ వెనక్కి తగ్గలేదు. రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్‌కు క్రేజ్ ఉన్న కారణంగా‌ ఇక్కడ ఎలాంటి ఫలితం వస్తుందోనని ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాకుండా గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ ‌ఎవరూ గెలుస్తారోనని పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.

మరోవైపు బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్న వినోద్ కుమార్ ఆ పార్టీలో కీలక నేత. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో సభ్యుడిగా, కేసీఆర్ హయాంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా సేవలందించారు. సహజంగానే బీఅర్ఎస్ శ్రేణులు వినొద్ కుమార్ గెలుపు గురించి చర్చించుకుంటున్నారు. ఇక్కడ ఎలాంటి ఫలితం ఉంటుందోనని అసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉండడంతోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వెలిచాల రాజేందర్ రావుకి టికెట్ ఇప్పించి ప్రచారంలో‌ ముందుండి నడిపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి బలమెంత? ఎలాంటి ఫలితం వస్తుందనే ఆసక్తి ‌కూడా కనబడుతుంది. ఈ మూడు పార్టీల కార్యకర్తలే కాకుండా సాధారణ‌ జనం కూడా ఇక్కడి ఫలితం పైనా అతృతగా ఎదురుచూస్తున్నారు..!

ఇటివల బెట్టింగ్ లు నిర్వహించడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా హాట్ సీట్ లో ఎక్కువ బెట్టింగ్ లు నిర్వహిస్తారు. ఇప్పుడు కరీంనగర్ స్థానం కూడా ఈ లిస్టులో చేరిపోయింది. దీంతో బెట్టింగ్ జోరందుకుంది. పోలీంగ్ సరళీ అధారంగా బెట్టింగ్ కి సిధ్ధం అవుతున్నారు. ముఖ్యంగా బీజేపీ గెలుస్తుందని బెట్టింగ్ నిర్వహించే వారి సంఖ్య ఎక్కువగా‌ కనబడుతుంది. అయితే ‌బెట్టింగ్ రాయుళ్ళపైనా పోలిసులు ఓ కన్ను వేశారు. కౌంటింగ్ సమయం దగ్గర పడ్డకొద్దీ అందరిలో ఉత్కంఠ మరింత పెరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..