Yadadri Laddu: యాదగిరి నర్శన్న లడ్డూకు పెరిగిన డిమాండ్.. దీని ప్రత్యేకమేంటో తెలుసా..?

కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి అంటే గుర్తుకు వచ్చేదీ స్వామి వారి లడ్డూ ప్రసాదం. తిరుమల తిరుపతి లడ్డూ తర్వాత రుచి, శుచిలో భక్తులు ఎక్కువగా ఇష్టపడేదీ శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డూ ప్రసాదం. అయితే ఇపుడు మహిమాన్విత యాదాగీరిశుడి లడ్డూ ప్రసాదానికి బాగా డిమాండ్ పెరిగింది.

Yadadri Laddu: యాదగిరి నర్శన్న లడ్డూకు పెరిగిన డిమాండ్.. దీని ప్రత్యేకమేంటో తెలుసా..?
Yadadri Laddu
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Jun 02, 2024 | 1:16 PM

కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి అంటే గుర్తుకు వచ్చేదీ స్వామి వారి లడ్డూ ప్రసాదం. తిరుమల తిరుపతి లడ్డూ తర్వాత రుచి, శుచిలో భక్తులు ఎక్కువగా ఇష్టపడేదీ శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డూ ప్రసాదం. అయితే ఇపుడు మహిమాన్విత యాదాగీరిశుడి లడ్డూ ప్రసాదానికి బాగా డిమాండ్ పెరిగింది.

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న మహిమాన్విత స్వయంభూ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తులు రోజురోజుకూ పెరుగుతున్నారు. సాధారణంగా ప్రతి రోజూ 30వేలు మంది భక్తులు, వారాంతపు, సెలవు దినాల్లో 65వేల మందికి పైగా దర్శించు కుంటున్నారు. ఏకశిఖర వాసుడిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్న భక్తులందరూ స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని మహిమాన్వితంగా భావిస్తారు. స్వామివారికి లడ్డూ ప్రసాదాన్ని ఇంటికి తీసుకు వెళ్లడం ఆనవాయితీ. అయితే స్వామివారి ఆలయంలో ప్రసాదాల టోకెన్లు, ప్రసాదాల పంపిణీ ఒకేచోట ఉండడంతో స్వామివారి లడ్డూ, పులిహోర ప్రసాదాలు పొందేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రసాద విక్రయశాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండడంతో చాలామంది భక్తులు ప్రసాదాలను కొనుగోలు చేయకుండానే వెనుతిరుగుతున్నారు.

సంబోద్భావుడి దర్శనానికి వచ్చే భక్తులకు అనుగుణంగా ప్రసాదాల విక్రయంపై దేవస్థానం అధికారులు దృష్టికి సారించారు. కొండ పైన శివాలయం పక్కన నూతనంగా ప్రసాదాల టికెట్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. దర్శనానికి విచ్చేసిన భక్తులంతా కూడా కౌంటర్‌ వద్దకు వెళ్లకుండా ఒక్క సభ్యుడు మాత్రమే వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రసాదాల విక్రయాలను గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఆలయ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ఏప్రిల్‌ నెలతో పోలిస్తే మే నెలలో రూ.1,74,63,580 అధికంగా ప్రసాదాల విక్రయాలు జరిగాయి. ప్రసాదాల నాణ్యతపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ప్రసాదాల టోకెన్లు, పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఆదివారంతో ఇతర సెలవు దినాల్లోనూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడంలేదు. ఏప్రిల్‌ నెలలో ప్రసాదాల విక్రయం ద్వారా రూ.3,05,08,630 కోట్లు రాగా, మే నెలలో రూ.4,79,72,210 ఆదాయం సమకూరింది.

ప్రసాదాల టోకెన్ల అవకతవకలను అరికట్టేందుకు..

తమ ఇలవేల్పుగా భావించి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని భక్తులకు ప్రసాదాల సజావుగా ఉండేందుకు దేవస్థానం చర్యలు తీసుకుంటోంది. స్వామి వారి ప్రసాదాల విక్రయానికి సంబంధించిన రశీదు బుక్‌లను గతంలో దేవస్థానం ఆధ్వర్యంలో ముద్రించేవారు. ప్రసాదాల కొనుగోలు రశీదుల ముద్రణ బాధ్యతలు సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు అప్పగించారు. తద్వారా రశీదులు రీసైక్లింగ్‌ కాకుండా అడ్డుకట్ట పడిందని భావిసున్నారు. ఈ నిర్ణయంతో ప్రసాదాల విక్రయాలు పెరిగాయి. శివాలయం ఎదురుగా నూతనంగా ప్రసాదాల కొనుగోలు కోసం ప్రత్యేకంగా ప్రసాదాలను భక్తులు కొనుగోలు చేస్తున్నారు.

యాదాద్రి ప్రసాదానికి భోగ్ గుర్తింపు…

ఇప్పటికే శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రసాదానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు తర్వాత యాదాద్రి లద్దూ ప్రసాదాన్ని భక్తులు అమితంగా ఇష్టపడతారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నుంచి భోగ్‌(బ్లిస్‌ఫుల్‌ హైజీనిక్‌ ఆఫరింగ్‌ టు గాడ్‌) జాతీయ స్థాయి గుర్తింపు పత్రం పొందింది.

మరిన్ని ఆధ్యాీత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!