AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ వృక్షమే దేవాలయం.. ఆకులు దేవతా మూర్తులు.. నిత్య పూజలతో హారతులు..

తమ కుటుంబ సభ్యులతో పాటు ఇళ్లలో ఇష్టంగా పెంచుకునే కుక్కలకు, పిల్లులకు బర్త్డేలు, పెళ్లిళ్లు, శ్రీమంతాలు చేసిన జంతు ప్రేమికులనే చూశాం. కానీ ఐఫిల్ టవరును మైమరపిస్తున్న ఓ చెట్టు ఆకును అపురూపంగా చూసుకుంటున్నారు. ఆ చెట్టును దేవాలయంగా భావిస్తూ నిత్యం పూజలు చేస్తున్నారు. ఆ చెట్టు ఏంటో, దాని పూర్తి కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భద్రాచలం ఏజెన్సీలోని పెద్దనల్లబల్లి గ్రామానికి చెందిన పుట్టా రాము, ఝాన్సీ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

ఆ వృక్షమే దేవాలయం.. ఆకులు దేవతా మూర్తులు.. నిత్య పూజలతో హారతులు..
Bhadrachalam
N Narayana Rao
| Edited By: |

Updated on: May 16, 2024 | 4:07 PM

Share

తమ కుటుంబ సభ్యులతో పాటు ఇళ్లలో ఇష్టంగా పెంచుకునే కుక్కలకు, పిల్లులకు బర్త్డేలు, పెళ్లిళ్లు, శ్రీమంతాలు చేసిన జంతు ప్రేమికులనే చూశాం. కానీ ఐఫిల్ టవరును మైమరపిస్తున్న ఓ చెట్టు ఆకును అపురూపంగా చూసుకుంటున్నారు. ఆ చెట్టును దేవాలయంగా భావిస్తూ నిత్యం పూజలు చేస్తున్నారు. ఆ చెట్టు ఏంటో, దాని పూర్తి కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భద్రాచలం ఏజెన్సీలోని పెద్దనల్లబల్లి గ్రామానికి చెందిన పుట్టా రాము, ఝాన్సీ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తమకు కడుపున పుట్టకున్నాప్పటికీ ఇంట్లో పెంచుకునే తమలపాకు మొక్కను కూడా మూడో సంతానంగా చెప్పుకుంటారు. పదేళ్ల క్రితం నాటిన తమలపాకు మొక్క ఇప్పుడు డెబ్బై అడుగుల ఎత్తుకు చేరింది. ఎవరైనా దీనిని చూస్తే ఆకాశానంటినట్లు ప్యారిస్‎లోని ఐఫిల్ టవరును మరపిస్తుంది. అందరి నోళ్లు పండించి, శుభకార్యమైనా, అశుభకార్యమైనా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకున్న ఈ తమలపాకు చెట్టును పవిత్రంగా భావిస్తున్నారు.

నిత్యం ఎంతో భక్తి, శ్రద్దలతో పూజలు చేస్తుంటారు. ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా తమలపాకు చెట్టుకు ఆవు పేడతో పాటు వర్మీకంపోస్ట్ సేంద్రియ ఎరువువలను వాడుతూ ఉంటారు. సారవంతమైన ఎర్రమట్టి, గోదావరి నీటిని వాడుతూ చెట్టు ఎదుగుదలను పట్టించకుంటున్నారు. దీంతో ఈ చెట్టుకు కాసే తమలపాకులు.. విస్తరాకుల వెడల్పుతో ఉండి చెట్టు మాత్రం ఆకాశానంటుతుంది. దీంతో సమీప ఏజెన్సీ గ్రామాలలో ఏ శుభకార్యాలు జరిగినా తలస్నామమాచరించి దేవతగా కొలిచే ఈ చెట్టుకు పూజా చేసి ఆ తరువాత ఈ తమలపాకులు వాడుతారు. తద్వారా తమ కుంటుంబాలు సుఖసంతోషాలతో ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఎంతో శ్రద్ధగా ఇష్టంగా పెంచుకున్న ఈ తమలపాకు చెట్టుకు నిత్యం పూజలు చేస్తూన్నారు. పవిత్ర గోదావరి నీటిని పోసి పూజల అనంతరం హారతి ఇస్తూ ఆ చెట్టును ఆలయంలో దేవుని విగ్రహంలా చూసుకుంటున్నారు. దీనిని చూసిన వారు ఈ చెట్టును పెంచుకుంటున్న ఇంటి వద్దకు వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ తెగ ప్రచారం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…