Telangana: ఈ నియోజకవర్గ త్రిముఖ పోరులో గెలుపు ఎవరిది..! పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి లాభం..

పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే ఉంది. అక్కడ టికెట్ ఎవరికి ఇస్తారు.. బరిలో ఎవరు నిలుస్తారు.. ఇలా చాలా చర్చ జరిగింది. పోలింగ్ ముగిసింది.. ఇక ఇప్పుడు ఆ పార్లమెంట్ స్థానంలో ఏపార్టీ జెండా ఎగరేస్తుంది? ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? ఇలా కొత్త చర్చ జరుగుతోంది. ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఎంతోమందిని ఆకర్షించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో తాజాగా ఇప్పుడు గెలిచేది ఎవరు అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది.

Telangana: ఈ నియోజకవర్గ త్రిముఖ పోరులో గెలుపు ఎవరిది..! పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి లాభం..
Brs Bjp Congress
Follow us

| Edited By: Srikar T

Updated on: May 16, 2024 | 4:32 PM

పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే ఉంది. అక్కడ టికెట్ ఎవరికి ఇస్తారు.. బరిలో ఎవరు నిలుస్తారు.. ఇలా చాలా చర్చ జరిగింది. పోలింగ్ ముగిసింది.. ఇక ఇప్పుడు ఆ పార్లమెంట్ స్థానంలో ఏపార్టీ జెండా ఎగరేస్తుంది? ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? ఇలా కొత్త చర్చ జరుగుతోంది. ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఎంతోమందిని ఆకర్షించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో తాజాగా ఇప్పుడు గెలిచేది ఎవరు అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. మెదక్ పార్లమెంటుపై ఇంత చర్చ జరగడానికి కారణం గతంలో ఇక్కడ రాజకీయ ఉద్దండులు ఎంపీ బరిలో నిలిచి దేశ రాజకీయాలను మర్చారు. మెదక్ పార్లమెంట్ అంటేనే ఒక మినీ ఇండియా. వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇక్కడి నుండి ఇందిరా గాంధీ ఎంపీగా పోటీ చేసి దేశ ప్రధాని కూడా అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడి నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అందుకే ఈ స్థానానికి అంతటి క్రేజ్. మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఈ మెదక్ పార్లమెంట్ నుండి బీఆర్ఎస్ నుండి వెంకట్ రాం రెడ్డి.. కాంగ్రెస్ నుండి నీలం మధు.. బీజేపీ నుండి రఘునందన్ బరిలో నిలిచారు. ఈ ముగ్గురు కూడా ఎన్నికల్లో గెలవడానికి తీవ్రంగా కృషి చేసారు. ఆయా పార్టీల జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు కూడా వారి అభ్యర్థుల గెలుపుకోసం జోరుగా ప్రచారం నిర్వహించారు. ఎలాగైనా సరే మెదక్ పార్లమెంట్‎పై జెండా పాతలని కసితో పనిచేశాయి మూడు ప్రధాన పార్టీలు. అందుకే చివరికి వరకు ఇక్కడ త్రిముఖ పోరే కొనసాగింది.

దీనికి తోడు ఈసారి పోలింగ్ పర్సంటేజ్ కూడా బాగా పెరిగి.. 75.90 పోలింగ్ నమోదు అయ్యింది. గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ పర్సంటేజ్‎తో చుస్తే ఈసారి 3.38 శాతం పెరిగింది. పెరిగిన పోలింగ్ ఎవరికి ప్లస్ అవుతుంది. ఈ త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారు అనే దాని పై బెట్టింగ్‎లు కూడా జోరుగా నడుస్తున్నాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా అందులో ఆరు స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఒక మెదక్ అసెంబ్లీ మాత్రం కాంగ్రెస్ దక్కించుకుంది. మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఇక్కడ నల్లేరు మీద నడకే అనే ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్, బీజేపీ కూడా ఈ సీట్‎ను చాలా సీరియస్ గానే తీసుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెదక్ సీట్ దక్కించుకోవాలని కసిగా పనిచేసింది. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రఘునందన్ మెదక్ ఎంపీగా గెలవాలని గట్టిగా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న మెదక్ పార్లమెంట్ స్థానంను దక్కించుకివడానికి కాంగ్రెస్, బీజేపి పార్టీలు బాగానే కృషి చేసాయి. అంతే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యూహాలు చేస్తూ ముందుకు సాగింది.

బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం మాజీ మంత్రి హరీష్ రావు అన్ని తానై ప్రచారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ పార్లమెంటు పరిధిలో తన బస్సు యాత్రను నాలుగు నియోజకవర్గాల్ల కవర్ అయ్యేలా ప్లాన్ చేసి, ప్రచారం నిర్వహించారు. ఇక మెదక్ పార్లమెంట్ పరిధిలో కీలకమైన నియోజకవర్గం సిద్దిపేట నియోజకవర్గం. ఇక్కడి ప్రజలు ఏ పార్టీ వైపు నిలిచారు.? అనే చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్న నాటి నుంచి మెదక్ పార్లమెంట్‎కు జరిగిన ఎన్నికల ఫలితాలను గమనిస్తే సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు తీర్పే కీలకంగా ఉంటుంది. సిద్దిపేట ప్రజలు ఏ పార్టీ వైపు నిలిస్తే ఆ పార్టీ గెలుపొందడం విశేషం. ఆ సెంటిమెంట్ దృష్ట్యా తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కేసీఆర్ చివరి సభను ఇక్కడే ఏర్పాటు చేశారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ వైపు నిలిచారన్న ఆంశంపై జోరుగా బెట్టింగ్‎లు సాగుతున్నాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట నియోజక వర్గంలో 2,37,591 మంది ఓటర్లకు గాను 1,74,969 (73.64శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 2,00,125 మంది ఓటర్లకు గాను 1,64,952(82.42 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇవి కూడా చదవండి

గజ్వేల్ నియోజక వర్గంలో 2,80,193 మంది ఓటర్లు కు గాను 2,25,607 (80.31 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా సిద్దిపేట జిల్లా మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7,18,629 ఓటర్లుకు గాను 5,65, 528 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక గతంలో జరిగిన 2019 లోక్ సభ ఎన్నికల్లో జిల్లాలోని మూడు నియోజకవర్గాలు 1,83, 772 ఓట్ల మెజార్టీని అందించాయి. గజ్వేల్ నియోజకవర్గంలో 84,187 ఓట్ల మెజార్టీ, దుబ్బాక నియోజకవర్గంలో 52,478 ఓట్ల మెజార్టీ, సిద్దిపేట నియోజకవర్గంలో 47,107 మెజార్టీ అందించడంతో కారు పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇలా మెదక్ పార్లమెంట్ ఏర్పాటైన నాటి నుంచి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు గులాబీ పార్టీకి పట్టం కడుతు వస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల మెజార్టీ సాధించినప్పటికి.. సిద్దిపేట నియోజకవర్గంలో వచ్చే మెజార్టీతో కారు పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగరేసిన సందర్భాలు ఉన్నాయి. గత రెండున్నర దశాబ్దాల కాలంగా మెదక్ పార్లమెంటు స్థానంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పట్టు బిగించి వరుస విజయాలతో మెదక్ లోక్​సభ స్థానంలో పాగా వేసాయి.

1998లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత బాగారెడ్డి ఎంపీగా గెలుపొందగా, ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు కాంగ్రెస్​ఈ స్థానంలో గెలవలేదు. 2009 ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన విజయశాంతి ఎంపీగా గెలుపొందాగా, 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్​అధినేత కేసీఆర్, 2019లో అదే పార్టీకి చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. ఇలా మెదక్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా మార్చుకుంది. గత సెంటిమెంట్ పునరావృతం అవుతుందని బీఆర్ఎస్ ధీమాతో ఉన్నారు. తాజాగా దేశంలో, రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆ పార్టీ ఓటు బ్యాంక్ తమవైపే మళ్లీందని కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు లెక్కలేసుకుంటున్నారు. బీజేపీ పార్టీ నుండి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, రాష్ట్ర సీనియర్లు రఘునందన్ తరపున ప్రచారం చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు పక్షాన ఆ పార్టీ నుండి ఏఐసీసీ కీలక నేత రాహుల్ గాంధీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇతర మంత్రులు ప్రచారం నిర్వహించారు. ఇలా గెలుపుపై ప్రధాన పార్టీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తుండగా.. మెదక్ పార్లమెంట్ జెండా ఎగరేసేదీ ఎవరో.. సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ వైపు నిలిచారో అనే ఉత్కంఠ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!