AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సెకండ్ హాండ్ వాహనాలు కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. పూర్తి వివరాలివే..

సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి సైబరాబాద్ పోలీసులు శుభవార్త చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొయినాబాద్ పీఎస్ గ్రౌండ్స్ లో వాహనాలను వేలం వేయనున్నట్లు తెలిపారు. తనిఖీల్లో పట్టుబడిన, సరైన పత్రాలు చూపించకుండా వెళ్తున్న, దొంగతనాలకు గురైన, రకరకాల నేరాలలో బుక్ అయిన వాహనాలను వేలంలో ఉంచనున్నట్లు హైదరాబాద్ సిటి పోలీసులు తెలిపారు. ఇలా సేకరించిన వాహనాలు సుమారు 522 ఉన్నట్లు తెలిపారు.

Hyderabad: సెకండ్ హాండ్ వాహనాలు కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. పూర్తి వివరాలివే..
Hyderabad
Srikar T
|

Updated on: May 16, 2024 | 3:43 PM

Share

సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి సైబరాబాద్ పోలీసులు శుభవార్త చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొయినాబాద్ పీఎస్ గ్రౌండ్స్ లో వాహనాలను వేలం వేయనున్నట్లు తెలిపారు. తనిఖీల్లో పట్టుబడిన, సరైన పత్రాలు చూపించకుండా వెళ్తున్న, దొంగతనాలకు గురైన, రకరకాల నేరాలలో బుక్ అయిన వాహనాలను వేలంలో ఉంచనున్నట్లు హైదరాబాద్ సిటి పోలీసులు తెలిపారు. ఇలా సేకరించిన వాహనాలు సుమారు 522 ఉన్నట్లు తెలిపారు. ఇందులో కొందరు తమ వాహనాలను ఎన్నో ఏళ్లుగా క్లైయిమ్ చేయకుండా అలాగే వదిలేశారని చెప్పారు. ఏవైనా క్రైంలలో పట్టుబడిన వాహనాలకు సంబంధించిన పత్రాలు, చలాన్లు చూపించి తమ వాహనాలను విడిపించుకోవచ్చని సూచించారు. దీనికి సంబంధించి నిర్ణీత గడువును కేటాయించారు. పోలీస్ యాక్ట్ 2004 ఆర్/డబ్ల్యు సెక్షన్ ప్రకారం సంబంధిత పోలీస్ అధికారి u/s 6(2), 7 ప్రకారం బహిరంగ వేలం వేయవచ్చని చట్టంలో ప్రతిపాదించబడింది.

అలాగే హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 39, 40&41ప్రకారం ఈ వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు చూపించి విడిపించుకోవచ్చని తెలిపింది. అలాగే ఎవరైన సెకండ్ హాండ్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉంటే వేలం ద్వారా ఇందులో తమకు నచ్చిన వాహనాలను వేలం వేసుకోవచ్చని సూచించింది. అయితే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందుగా వాహనాన్ని విడిపించుకోవడానికైనా, కొనుగోలు చేసుకోవడానికైనా ప్రత్యేకించి ఒక ఫారం నింపాల్సి ఉంటుంది. ఇలా దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్‎ను పోలీసు కమీషనర్ పరిశీలిస్తారు. సైబరాబాద్ కమిషనరేట్ నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నుండి ఆరు నెలల వ్యవధిలో వారి వాహనాలను క్లెయిమ్ చేసుకోవచ్చు. లేని పక్షంలో వదిలివేయబడిన లేదా క్లెయిమ్ చేయని వాహనాలు బహిరంగ వేలం నిర్వహిస్తామని తెలిపారు. వాహనాల వివరాలు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ గ్రౌండ్‌లో ఉంటాయని ఆసక్తి ఉన్న వారు ఎన్.వీరలింగం, MTO-2, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫోన్ నెం.9490617317 కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. అలాగే సైబరాబాద్ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ www.cyberabadpolice.gov.inలోకూడా పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…