Hyderabad: ఒకరు కాదు ఇద్దరు కాదు… సుమారు 50 మంది.. ఆర్టీసీ బస్సును ఆపి..

హైదరాబాద్ శివార్లలోని రాచలూరు గేటు వద్ద గురువారం RTC బస్సును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సులు ప్రజల సొత్తు అని, వాటిని కాపాడుకోవాల్సింది ప్రజలేనని సజ్జనార్ పేర్కొన్నారు. పోలీసు శాఖ సహకారంతో నిందితులపై హిస్టరీ షీట్లను కూడా తెరుస్తామని... బస్సు నష్టం ఖర్చులను వారి నుంచి వసూలు చేస్తామన్నారు.

Hyderabad:  ఒకరు కాదు ఇద్దరు కాదు... సుమారు 50 మంది.. ఆర్టీసీ బస్సును ఆపి..
TSRTC Bus
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: May 16, 2024 | 3:55 PM

అల్లరిమూకలు చెలరేగిపోయారు. సైడ్‌ ఇవ్వలేదంటూ ఆర్టీసీ బస్సుపై తమ ప్రతాపం చూపించారు. అడ్డొచ్చిన ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు… సుమారు 50 మంది యువకులు బస్సుని ఆపి అద్దాలు పగులగొట్టి హల్‌చల్‌ చేశారు. హైదారాబాద్‌ శివారు రాచులూర్ గేట్‌ వద్ద జరిగిందీ ఘటన. కల్వకుర్తి డిపో బస్సును బైక్‌పై వెళ్తున్న కొందరు యువకులు టార్గెట్‌ చేశారు. ఎంతసేపు హారన్‌ కొట్టినా సైడ్‌ ఇవ్వట్లేదంటూ బస్సుని వెంబడించి, ఆపి మరి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. హారన్‌ కొడితే సైడ్‌ ఇవ్వడం తెలీదా అంటూ డ్రైవర్‌, కండక్టర్‌పై దాడికి యత్నించారు. అడ్డొచ్చిన ప్రయాణికులనూ ఇష్టం వచ్చినట్లు దూషించి, వారిని భయబ్రాంతులకు గురిచేశారు. బస్సుని ఆపడమే కాదు మరికొందరికి ఫోన్‌ చేసి రప్పించి నడిరోడ్డుపైనే హంగామా సృష్టించారు.

అల్లరిమూకల దాడి ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. డ్రైవర్‌, కండక్టర్‌ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డ్రైవర్‌, కండక్టర్‌ తమ ఫోన్‌లో తీసిన ఫోటోలు, బైక్‌ నంబర్ల‌ ఆధారంగా యువకుల కోసం గాలిస్తున్నారు.

బస్సుపై దాడి ఘటనను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్‌ మీడియా వేదికగా ఖండించారు. ఆర్టీసీ బస్సు ప్రజలందరి ఆస్తి అని..దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందన్నారాయన. ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న బస్సులపై ఎలాంటి కారణం లేకుండా దాడులు చేయడాన్ని టీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదన్నారు. ఆర్టీసీ బస్సుపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామన్న సజ్జనార్.. త్వరలోనే నిందితులు దొరుకుతారన్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?