Telangana: తెలంగాణలో BJP గెలిచే స్థానాలు ఎన్నంటే..? ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేది తామంటే తామేనంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి. తెలంగాణలో 13 నుంచి 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనావేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా బీజేపీ 12 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తుందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తంచేశారు.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేది తామంటే తామేనంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి. తెలంగాణలో 13 నుంచి 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనావేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా బీజేపీ 12 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తుందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తంచేశారు. మోదీ పాలనలో భారత్‌లో హింసకు తావులేకుండా ప్రశాంతకు నిలయంగా మారిందన్నారు బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్. ప్రపంచంలోనే స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్‌గా మోదీ ఎదిగారన్నారు. నల్గొండలో నిర్వహించిన పట్టభద్రుల సన్నాహక సమావేశంలో ఆయన ఈ కామెంట్లు చేశారు.
బీఆర్ఎస్ కి రెండోసారి ప్రజలు అధికారం ఇస్తే..అహంకారంతో వ్యవహించారని విమర్శించారు. సాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తక్కువ సమయంలోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీకి ఓటేశారని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ బీజేపీ సత్తా చాటుతుందన్నారు.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

