Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఉప్పల్‌లో మ్యాచ్ కష్టమే..

హైదరాబాద్‌లో మళ్లీ వర్షం దంచికొడుతోంది. నగరం మొత్తం కుండపోత కురుస్తోంది. గంట నుంచి అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు వరుణుడు. భారీ వర్షానికి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయ్‌!. ఆకస్మికంగా మొదలైన వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు.

Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఉప్పల్‌లో మ్యాచ్ కష్టమే..
Andhra Weather
Follow us
Ram Naramaneni

|

Updated on: May 16, 2024 | 4:19 PM

ఎండలు బాబోయ్‌ ఎండలు.. కాదు కాదు.. వానలు బాబోయ్‌ వానలు.. ఎస్‌.. నిన్న మొన్నటివరకు మండే ఎండలపై అలెర్ట్‌లు.. ఇప్పుడు.. దంచి కొట్టే వానలపై అలెర్ట్‌లు వస్తున్నాయ్‌.. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి.. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయ్‌.. హైదరాబాద్‌లోనూ గత వారంలో వర్షం బీభత్సం సృష్టించింది. అయితే.. ఇప్పుడు మరోసారి వాతావరణ శాఖ హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన చేయడం భయపెడుతోంది. ఇవాళ, రేపు హైదరాబాద్‌ నగరంలో వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ.. కాసేపట్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. వాతావరణశాఖ హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన చేయడంతో నగరవాసులు వణికిపోతున్నారు. ఇప్పటికే సిటీ వ్యాప్తంగా నల్లటి మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, DRF బృందాలు అప్రమత్తమయ్యాయి. వర్షం వల్ల సమస్యలు తలెత్తితే, సహాయం కోసం డీఆర్ఎఫ్ నెంబర్లు 040-21111111, 9000113667 సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కష్టమే….

ఐపీఎల్ 17వ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ బెర్తుకు హైదరాబాద్‌ చేరువగా వచ్చే అవకాశాన్ని వరుణుడు లాగేసుకుపోయే అవకాశం కనిపిస్తోంది. గుజరాత్‌తో హోం గ్రౌండ్‌లో జరగనున్న మ్యాచ్‌లో గెలిస్తే చాలు ఇతర జట్లతో సంబంధం లేకుండా నాకౌట్‌కు వెళ్లిపోతుంది. కానీ భారీ వర్ష సూచనతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…