Hyderabad: ఆ బైక్స్ అన్నీ సీజ్.. హైదరాబాద్ పోలీసుల కీలక హెచ్చరిక

గత కొంత కాలంగా నగరంలో సెలఫోన్‌ దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌లు ఎక్కువయ్యాయి. రోడ్డు మీద నడుచుకుంటూ.. ఫోన్‌ మాట్లాడుతూ వెళ్లే వారిని టార్గెట్‌ చేసి.. సడెన్‌గా వచ్చి వారి మెడలోని చైన్‌లు, సెల్‌ఫోన్‌లు లాక్కెళ్తున్నారు దుండగులు. బైక్‌ల మీద వచ్చి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. అయితే...

Hyderabad: ఆ బైక్స్ అన్నీ సీజ్.. హైదరాబాద్ పోలీసుల కీలక హెచ్చరిక
Hyderabad Traffic Police
Follow us
Ram Naramaneni

|

Updated on: May 16, 2024 | 2:37 PM

హైదరాబాద్‌ సిటీలో ఇటీవల  చైన్ స్నాచింగ్‌ కేసులు విపరీతంగా పెరిగాయి. రోడ్డు మీద ఒంటరిగా మహిళ కనబడితే చాలు.. కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో.. బైక్‌పై వచ్చి చైన్ స్నాచర్స్ గొలుసులు తెంపుకుని వెళ్లిపోతున్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులకు ఉన్న ప్రధాన సోర్స్ సీసీ కెమెరాలు. అయితే ఇటువంటి చాలా కేసుల్లో సీసీ కెమెరాలను పరిశీలించగా.. సదరు బైకులకు నెంబర్ ప్లేట్స్ ఉండటం లేదు. దీంతో దొంగల్ని పట్టుకోవటం పోలీసులకు పెద్ద సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఎక్కడ కనిపించినా సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సైఫాబాద్‌ పోలీసులు డ్రైవ్ నిర్వహించి నెంబర్‌ ప్లేట్‌ లేని వెహికల్స్ స్వాధీనం చేసుకున్నారు. మొదటి రోజే.. 20కి పైగా బైక్స్ పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కొత్త నెంబరు ప్లేట్‌ బిగించుకున్న తరువాతే.. తిరిగి ఆ వాహనాలకు ఓనర్స్‌కు ఇచ్చారు. నెంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలు నడుపుతున్న వారిలో ఎక్కువగా యువతే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వయసుపైడిన వారు కూడా కొందరు ఈ తరహా బైక్‌లు వినియోగిస్తున్నట్లు తెలిపారు

పేరెంట్స్ కూడా వారి పిల్లలను అలెర్ట్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అదే విధంగా.. నంబర్ ప్లేటుపై చివరి అంకెలు కనిపించకుండా నెంబర్‌ ప్లేట్‌ను ట్యాంపరింగ్ చేసినా.. కనిపించకుండా స్టిక్కర్లు అంటించినా.. బండి సీజ్ చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్ సిటీలోని అన్ని పోలీసు పోలీసు స్టేషన్లలో ఈ స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. పౌరల రక్షణ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గమని చెబుతన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…   

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?