Watch Video: టీవీ సీరియల్‌ మేకప్‎మెన్ డెత్ మిస్టరీలో పురోగతి.. ఆ కోణంలో దర్యాప్తు..

Watch Video: టీవీ సీరియల్‌ మేకప్‎మెన్ డెత్ మిస్టరీలో పురోగతి.. ఆ కోణంలో దర్యాప్తు..

Srikar T

|

Updated on: May 16, 2024 | 1:58 PM

హైదరాబాద్‌ కార్మికనగర్‌లో జరిగిన మర్డర్‌ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. హత్యకు గురైన యువకుడిని టీవీ సీరియల్‌ మేకప్‌మెన్‌ తరుణ్‌తేజ్‌ అలియాస్‌ చుక్కా చెన్నయ్యగా గుర్తించారు. తరుణ్‌తేజ్‌ సొంతూరు మహబూబ్‌నగర్‌ వనపర్తిగా తేల్చారు పోలీసులు. శ్రీరాంనగర్‌లోని నిమ్స్‌మే మైదానంలో తరుణ్‌తేజ్‌ను అత్యంత దారుణంగా హత్యచేశారు దుండగులు. మృతదేహం గోడకు ఆనుకొని ఉండటంతో క్లూస్‌టీమ్‌, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు పోలీసులు.

హైదరాబాద్‌ కార్మికనగర్‌లో జరిగిన మర్డర్‌ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. హత్యకు గురైన యువకుడిని టీవీ సీరియల్‌ మేకప్‌మెన్‌ తరుణ్‌తేజ్‌ అలియాస్‌ చుక్కా చెన్నయ్యగా గుర్తించారు. తరుణ్‌తేజ్‌ సొంతూరు మహబూబ్‌నగర్‌ వనపర్తిగా తేల్చారు పోలీసులు. శ్రీరాంనగర్‌లోని నిమ్స్‌మే మైదానంలో తరుణ్‌తేజ్‌ను అత్యంత దారుణంగా హత్యచేశారు దుండగులు. మృతదేహం గోడకు ఆనుకొని ఉండటంతో క్లూస్‌టీమ్‌, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు పోలీసులు. మారణాయుధాలతో దాడి చేస్తుండగా పరిగెత్తుకుంటూ వెళ్లి గోడ దగ్గర కుప్పకూలి ఉంటాడని అంచనాకి వచ్చారు. తరుణ్‌తేజ్‌తోపాటు నిమ్స్‌మే మైదానంలోకి ఎవరెవరు వచ్చారు? ఎలా వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కార్మికనగర్‌, శ్రీరాంనగర్‌ పరిధిలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అయితే బ్రతుకు తెరువు కోసం సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని ఏళ్లుగా తరుణ్ మేకప్ మెన్ గా పని చేస్తున్నాడు. ఇతనిని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే అంశంపై కూడా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. గతంలో చేసిన సీరియల్స్, ఎవరెవరితో ఎలా ఉంటేవాడు, ఇతనికి సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా శత్రువులు ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: May 16, 2024 01:22 PM