ఈ క్రిస్మస్‎కి టేస్టీ టేస్టీ విరుదునగర్ మటన్‎ సుక్కా.. మీ కిచెన్‎లోనే..

Prudvi Battula 

Images: Pinterest

20 December 2025

మీరు మటన్ ఎలా తిన్నా, విరుదునగర్ మటన్ సుక్కా‎కి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఇది తమిళనాడులో చాల ఫేమస్ రెసిపీ.

విరుదునగర్ మటన్‎ సుక్కా

ఇప్పుడు మీరు తమిళనాడు స్పెషల్ విరుదునగర్ మటన్ సుక్కా తినాలనుకుంటే, మీరు ఎలాంటి హోటల్‎కి వెళ్ళనవసరం లేదు.

హోటల్‎కి వెళ్ళనవసరం

మీరు దీన్ని మీ ఇంట్లోనే సులభంగా వండుకోవచ్చు. రుచికరమైన విరుదునగర్ మటన్ సుక్క ఎలా తయారు చేయాలో చూద్దాం!

ఇంట్లోనే సులభంగా వండుకోవచ్చు

విరుదునగర్ మటన్ సుక్కా  కోసం ఎముకలు లేని మటన్, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పొడి, కారం పొడి, నువ్వుల నూనె, కొత్తిమీర, కరివేపాకు, ఎండు మిరపకాయలు, ఉప్పు కావాలి.

కావలసినవి

ముందుగా ఉల్లిపాయ, మటన్‎ను చిన్న చిన్న ముక్కలుగా కోయండి. వీటిని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి.

చిన్న చిన్న ముక్కలుగా కోయండి

తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్‎లో నూనె వేడి చేసి, తరిగిన ఎండు మిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ వేసి వేయించి అల్లం, వెల్లుల్లి వేయండి.

వేయించాలి

అందులో ఉల్లిపాయ బంగారు రంగులోకి మారిన తర్వాత, మటన్, కారం వేసి వేయించి, కొద్దిగా నీరు పోసి బాగా ఉడికించాలి.

బాగా ఉడికించాలి

బాగా ఉడికిన తర్వాత, జీలకర్ర పొడి చల్లి, ఉప్పు వేసి బాగా కలిపి, కొత్తిమీరతో అలంకరించండి. అంతే విరుదునగర్ మటన్ సుక్కా సిద్ధం.

రెసిపీ సిద్ధం