Watch Video: పొలిటికల్ వార్ ముగిసింది.. ఫ్యామిలీ టైమ్ అంటున్న నేతలు.. ఎలా రిలాక్స్ అవుతున్నారంటే..
ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూమ్‌లో భద్రంగా ఉంది. రెండు నెలలపాటు ప్రచారాలతో బిజీ బిజీగా గడిపిన అభ్యర్థులు వారికి మద్దతుగా ప్రచారంలో పరుగులు పెట్టిన ఎమ్మెల్యేలు, నేతలు రిలాక్స్ అవుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు ఎగ్జిబిషన్స్‌తో కొందరు.. మరి కొందరు ఇంట్లో పిల్లలతో గేమ్స్ ఆడుతూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు రెండు రోజులుగా ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నారు.
ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూమ్‌లో భద్రంగా ఉంది. రెండు నెలలపాటు ప్రచారాలతో బిజీ బిజీగా గడిపిన అభ్యర్థులు వారికి మద్దతుగా ప్రచారంలో పరుగులు పెట్టిన ఎమ్మెల్యేలు, నేతలు రిలాక్స్ అవుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు ఎగ్జిబిషన్స్‌తో కొందరు.. మరి కొందరు ఇంట్లో పిల్లలతో గేమ్స్ ఆడుతూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు రెండు రోజులుగా ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నారు. కొద్దిరోజులుగా ప్రచారాలతో ఉదయం నుంచి రాత్రి వరకు చెమటోడ్చిన నేతలంతా ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. వరంగల్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య, బీజేపీ అభ్యర్థిగా అరూరి రమేష్, బీఆర్ఎస్ నుండి డాక్టర్ సుధీర్ కుమార్ పోటీ చేశారు. పోటీ చేసిన అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ప్రచారంలో పరుగులు పెట్టారు. కడియం కావ్యకు మద్దతుగా ఆమె తండ్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరితోపాటు ఇతర ఎమ్మెల్యేలు గట్టి ప్రచారమే చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన బహిరంగ సభలు రోడ్ షోలు, విజయవంతం చేయడంతో పాటు తమ తమ నియోజకవర్గాలలోను ప్రచారాలు కోసం అలుపెరగకుండా పనిచేశారు.
పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. ఈవీఎంలు వ్యవసాయ మార్కెట్లోని స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్నాయి. మూడంచల భద్రతతో.. ఈవీఎంలకు సాయుధ బలగాలతో నిరంతర నిఘా కొనసాగుతోంది. వాళ్ళ జాతకాలు జూన్ 04న బయట పడనున్నాయి. కౌంటింగ్ జూన్ 4న జరగనుండడంతో అప్పటివరకు నేతలకు కొంత టైం దొరికింది. రెండు నెలలపాటు కంటిమీద కునుకు లేకుండా ఎన్నికల బిజీలో ఉన్న నేతలు ఇక రిలాక్స్ అవుతున్నారు. కుటుంబ సమేతంగా విహార యాత్రలు, సరదాగా నేతలు గడుపుతున్నారు. ఇక నెలరోజుల తర్వాత టైమ్ దొరకడంతో ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులతో కలసి కాలక్షేపం చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి ఎగ్జిబిషన్లో సందడి చేశారు. భార్య, కూతురు, అల్లుడు, మనవరాలుతో కలిసి ఎగ్జిబిషన్లు సరదాగా గడిపారు. సరదాగా కుటుంబంతో రిలాక్స్ అయ్యారు.
ఇక పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆమె అత్త, కాంగ్రెస్ సీనియర్ నేత ఝాన్సీ రెడ్డి కుటుంబ సభ్యులకు సరదాగా గడిపారు. పోలింగ్ పూర్తయిన నెక్స్ట్ డే నే తొర్రూర్ మండలం నాంచారి మాడుర్ గ్రామ శివారులోని రెడ్డి గార్డెన్లో మదర్స్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అత్త ఝాన్సీరెడ్డి, కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరయ్యారు. ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి ఉల్లాసంగా ఉత్సాహంగా డాన్సులతో అదరగొట్టారు. ఇక వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పోలింగ్ పూర్తి కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి రిలాక్స్ అవుతున్నారు. రెండు నెలలుగా తన పిల్లలకు కుటుంబ సభ్యులకు రెండు నిమిషాలు కూడా టైం ఇవ్వలేనంత బిజీగా గడిపానని.. ఎన్నికల హడావుడిలో గడపాల్సి వచ్చిందని కావ్య చెప్తున్నారు. ఇంట్లోనే పిల్లలతో కలిసి గేమ్స్ ఆడుతూ రిలాక్స్ అవుతున్నారు. బీజేపీ అభ్యర్థి రమేష్ కూడా రిలాక్స్ అయ్యారు. కుటుంబసభ్యులతో సరదాగా గడిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం శ్రమించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కూడా కాస్త రిలాక్స్ అయ్యారు. వారి కుటుంబ సభ్యులతో గడిపారు. ప్రస్తుతం రిలాక్స్ అవుతున్న కౌంటింగ్ కోసం ఎదురుచూపు తపడం లేదు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న నేతలకు జూన్ 4 తారీఖు వరకు టెన్షన్ మాత్రం వారికి తప్పదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..