AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ స్టైల్ కొత్తిమీర రోటీ పచ్చడి.. ఇలా చేస్తే అదిరిపోద్దీ అంతే?

కొత్తిమీర రోటీ పచ్చడి అంటే ఎవ్వరైనా సరే వావ్ అనాల్సిందే. ఇక తెలంగాణ స్టైల్ రోటీ పచ్చడిని ఎవ్వరైనా సరే ఇష్టపడి తింటుంటారు. మరి మీరు కూడా కారంగా, టేస్టీగా ఉండే కొత్తిమీర రోటీ పచ్చడి తినాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన సమాచారం. దీనిని ఇంటిలోనే సులభంగా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jan 19, 2026 | 3:02 PM

Share
కావాల్సిన పదార్థాలు : కొత్తిమీర అర కేజీ, టమాటాలు రెండు లేదా మూడు, పచ్చిమర్చి నాలు నుంచి ఐదు వరకు. వెల్లుల్లి రెబ్బలు 10 , చింత పండు నిమ్మకాయ సైజు. అదే విధంగా, జీలకర్ర వన్ టీ స్పూన్, పోపు దినుసులు, మినపప్పు, పచ్చి శనగపప్పు, నువ్వులు వన్ టీస్పూన్, ఉప్పు రుచికి సరిపడ. నూనె తాళింపుకు సరిపడ, ఇంగువ చిటికెడు, కరివేపాకు నాలుగు రెబ్బలు, ఎండు మిర్చి మూడు, ఆవాలు వన్ టీస్పూన్. పసుపు, జీలకర్ర.

1 / 5
తయారీ విధానం : ముందుగా కొత్తిమీరను తీసుకొని, దానిని ఒకటికి రెండు సార్లు నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత కొత్తిమీరను ఒక బౌల్‌లో వేసి తడి పోయేవరకు ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. అది ఆరే వరకు మనం టమాటాలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా చేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

2 / 5
దీని తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో మెంతులు, వన్ టీస్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టి అదే పాన్ లో కొంచెం నూనె పోసుకొని, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను, కొత్తిమీర మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే చింతపండు, పచ్చి మిర్చి వేసి పది నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
తర్వాత  మనం ముందుగా వేయించుకున్న  ఆవాలు, మెంతులు, ధనియాలు రోటీలో వేసి మెత్తగా, రుబ్బుకోవాలి. తర్వాత అందులోనే రాళ్ల ఉప్పు, పచ్చి మిర్చి, కారం వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.

4 / 5
 దీని తర్వాత మళ్లీ స్టవ్ ఆన్ చేసి, తాళింపు కోసం ఒక పాన్ పెట్టి, అందులో  పోపు దినుసులు, మినపప్పు, శనగలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు , ఎండు మిర్చీ వేసి, అవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా రుబ్బుకున్న  కొత్తిమీర, టామాట పచ్చడి పేస్ట్ ఇందులో వేయాలి. తర్వాత తాళింపు మొత్తం పచ్చడికి పట్టేలా మంచిగా కలుపుకోవాలి. అంతే తెలంగాణ స్టైల్ కొత్తి మీర రోటీ పచ్చి రెడీ.

5 / 5
కేంద్రం 500 రూపాయల నోట్లను నిలిపివేస్తుందా? ఇక కనిపించవా?

తెలంగాణ స్టైల్ కొత్తిమీర పచ్చడి.. ఇలా చేస్తే అదిరిపోద్దీ అంతే?

12 ఏళ్ల తర్వాత గురు వక్ర నివర్తి.. మూడు రాశులకి అదృష్ట యోగం

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..

సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట

ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!

టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా

నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..

దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా

చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..