వెన్నునొప్పితో బాధపడుతున్న వ్యక్తి చాట్‌జీపీటీని ఆశ్రయించి మందులు వాడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. చాట్‌జీపీటీ సూచించిన మందుల వల్ల అతనికి అంతర్గత రక్తస్రావం జరిగింది. ఈ ఘటనపై ఎయిమ్స్ వైద్యురాలు ప్రజలను హెచ్చరించారు. వైద్యపరమైన సమస్యలకు చాట్‌జీపీటీ సలహాలు తీసుకోవద్దని, సరైన రోగ నిర్ధారణ లేకుండా మందులు వాడటం ప్రాణాలకు ప్రమాదమని స్పష్టం చేశారు.