Sai Pallavi: బాలీవుడ్ లో సాయిపల్లవి ప్రూవ్ చేసుకోవాల్సిందే
2026 సాయి పల్లవికి అత్యంత కీలకం కానుంది. ఈ ఏడాది ఆమె నటించిన ఏక్ దిన్, రామాయణ్ రెండు బాలీవుడ్ చిత్రాలు విడుదలవుతున్నాయి. సౌత్‌లో లేడీ పవర్ స్టార్‌గా గుర్తింపు పొందిన పల్లవికి, నార్త్‌లో తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రీమేక్ వివాదాలు, తారలతో పోలికల మధ్య ఆమె ప్రయాణం ఆసక్తికరంగా మారనుంది.
2026 సంవత్సరం నటి సాయి పల్లవికి అత్యంత ప్రత్యేకమైనదిగా నిలవనుంది. ఈ ఏడాది ఆమె నటించిన రెండు బాలీవుడ్ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల కావడానికి సిద్ధమవుతున్నాయి. దక్షిణాదిలో ఇప్పటికే లేడీ పవర్ స్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి, ఉత్తరాదిలో తన సామర్థ్యాన్ని ఏ స్థాయిలో నిరూపించుకుంటుందనేది ఈ చిత్రాలు నిర్ణయిస్తాయి. ఏక్ దిన్ టీజర్ విడుదలైనప్పటి నుంచి సాయి పల్లవి పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇది ఆమె బాలీవుడ్ డెబ్యూ చిత్రం కాగా, వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించారు. అయితే, ఏక్ దిన్ పోస్టర్ థాయ్ రొమాంటిక్ డ్రామా వన్ డేను పోలి ఉందని, బాలీవుడ్ డెబ్యూకి రీమేక్‌ను ఎందుకు ఎంచుకున్నారని కొన్ని విమర్శలు వెలువడ్డాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: ఓజీ వైబ్స్ ని కంటిన్యూ చేయనున్న పవన్ కల్యాణ్
హ్యాట్రిక్ హిట్ అందుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు
ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం ట్రై చేస్తున్న హీరోలు
Dhruva Natchathiram: ‘ధృవ నక్షత్రం’.. ఈసారి నిజంగానే వస్తుందా
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

