మంగళగిరిలో ఎయిర్ పోర్ట్‌ను తలదన్నేలా.. రైల్వే హబ్.. కొత్త రూపు దిద్దుకుంటున్న రైల్వే స్టేషన్స్!
అమృత్ భారత్ పథకంలో భాగంగా రాయనపాడు, మంగళగిరి రైల్వే స్టేషన్లు ఆధునిక రూపురేఖలు సంతరించుకుంటున్నాయి. కొత్త టెక్నాలజీ, అత్యాధునిక సౌకర్యాలతో ఎయిర్‌పోర్టుల తరహాలో అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే ఆయా రైల్వే స్టేషన్‌ల పునర్నిర్మాణ పనులు 80-95% పూర్తయ్యాయి. వచ్చే ఏడాది ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న ఈ స్టేషన్లు విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గిస్తాయి, ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి.

అమరావతి రాజధాని పరిధిలోని రాయనపాడు రైల్వే స్టేషన్‌కు మహర్దశ పట్టింది. సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్లో భాగంగా ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ నూతన సాంకేతికతతో రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే దీని పునర్నిర్మాణ పనులు దాదాపు 80% వరకు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది ఈ స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇదొక్కటే కాదు మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి రైల్వే స్టేషన్ సైతం కొత్త రూపులు దిద్దకుంటుందోంది.
మంగళగిరి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు సైతం సుమారు 95% పూర్తయ్యాయి. ఎయిర్పోర్టుల తరహాలో ఓ కాంప్రహెన్సివ్ ట్రావెల్ హబ్‌గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. నూతన టెక్నాలజీ అత్యాధునిక సౌకర్యాలతో త్వరలోనే ఈ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఇక్కడ సర్కులేటింగ్ ఏరియా పార్కింగ్ , విఐపి లాంచ్ , రియర్ సైడ్ బిల్డింగ్ , ఇప్పటికే రెడీ అయ్యాయి. ప్లాట్ ఫామ్ సర్ఫాసింగ్, వికలాంగులకు సౌకర్యాలు, ఫేకెట్ పనుల పురోగతిలో ఉన్నాయి.
రైలు ప్రయాణం చేసే ప్రయాణికులకు ఆధునిక, మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ భారత్ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా కింద ఎంపిక చేసిన స్టేషనులను డెవలప్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో విజయవాడ , విశాఖ , తిరుపతి , నెల్లూరు , ఆదోని , అనంతపురం , చీరాల , చిత్తూరు , కడప, ధర్మవరం , గుడివాడ , గుత్తి , గుంటూరు , హిందూపురం , కదిరి , కాకినాడ టౌన్ , కొత్తవలస జంక్షన్ , కర్నూలు , కుప్పం , రాజమండ్రి , ఒంగోలు , రేణిగుంట , రాజంపేట వంటి స్టేషన్లు ఉన్నాయి..
రాయనపాడు స్టేషన్ కూడా ఇందులో భాగంగానే పునర్నిర్మాణం అవుతుంది. ఇక్కడ ఫ్లాట్ ఫార్ములా నిర్మాణం , టికెట్ కౌంటర్లు , వెయిటింగ్ హాల్లు , ఫ్లాట్ ఫామ్ లపైన షెడ్ల నిర్మాణం ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి.. రైల్వే స్టేషన్ నూతన వసతులతో కొత్తగా అందుబాటులోకి రానుంది. స్టేషన్ ముఖద్వారం విశాలమైన సర్కులేటింగ్ ఏరియా లిస్టులు, వెయిటింగ్ హాల్లు, టాయిలెట్స్ , రూపుమార్చిన ఫ్లాట్ ఫామ్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.
అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత మరిన్ని రైళ్లు ఆగేందుకు అవకాశం కూడా ఉంటుంది. దీంతో విజయవాడ రైల్వే స్టేషన్ పై ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయి.. విజయవాడలో ప్రస్తుతం నిత్యం 100కు పైగా రైలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. జనాల తాకిడి అధికంగా ఉంటుంది.. దీనికి ప్రత్యామ్నాయంగా రాయనపాడు స్టేషన్ను అభివృద్ధి చేయటం వలన మరికొన్ని రైళ్లకు ఇక్కడ హాల్టు సౌకర్యం కల్పించడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
