Exim Bank: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. బ్యాంకులో పెద్ద పోస్టుల కోసం ఇప్పుడే అప్లై చేయండి
Exim Bank: ఎగ్జిమ్ బ్యాంక్ ఇండియా ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రైనీ(MT) పోస్టుల భర్తీకి నియామక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకానికి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఫిబ్రవరి 1, 2026 వరకు కొనసాగుతుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు చివరి తేదీలోగా అధికారిక వెబ్‌సైట్ eximbankindia.in ని దరఖాస్తు చేసుకోవాలి.

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఇండియా ఎగ్జి్మ్ బ్యాంక్.. ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రైనీ(MT) పోస్టుల భర్తీకి నియామక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకానికి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఫిబ్రవరి 1, 2026 వరకు కొనసాగుతుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు చివరి తేదీలోగా అధికారిక వెబ్‌సైట్ eximbankindia.in ని దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్‌లో మొత్తం 40 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో 19 స్థానాలు అన్‌రిజర్వ్డ్ కేటగిరీలకు, 5 ఎస్సీలకు, 3 ఎస్టీలకు, 10 ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు, 3 ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వ్ చేయబడ్డాయి.
అర్హతలు
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత రంగంలో MBA/PGDBA/PGDBM/MMS/CA పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు కనీస వయస్సు21 ఏళ్ల కంటే తక్కువ కాకుండా ఉండాలి. 28 ఏళ్లకు మించి ఉండదరాదు. రిజర్వ్డ్ వర్గాలకు నిబంధన ప్రకారం వయో సడలింపు లభిస్తుంది. వయస్సును డిసెంబర్ 31, 2026 నాటికి లెక్కిస్తారు.
దరఖాస్తు రుసుము వివరాలు
ఈ నియామక నియామకానికి దరఖాస్తు రుసుము జనరల్, OBC వర్గాలకు రూ. 600 కాగా, SC/ST/EWS/PWBD వర్గాలకు చెందిన వారు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ ఈ నియామకంలో దరఖాస్తు నింపడానికి, ముందుగా ibpsreg.ibps.in/iebmtnov25/ పోర్టల్‌ను సందర్శించండి. హోంపేజీలో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేసి, అభ్యర్థించిన వివరాలు పూరించి రిజిస్టర్ చేసుకోండి. ఆ తర్వాత ఇతర వివరాలను పూరించి, ఫారం పూర్తి చేయండి. సంతకం, ఫొటోగ్రాఫ్ అప్‌లోడ్ చేయండి. కేటగిరీ ప్రకారం.. నిర్దేశించిన రుసుము చెల్లించండి. చివరగా పూర్తిగా సమర్పించిన ఫారంను, భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకుని ఉంచుకోండి.
ఎంపిక: వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ నియామకాలు జరుగుతాయి.
ఎగ్జిమ్ బ్యాంక్ ఎంటీ రిక్రూట్ మెంట్ దరఖాస్తు ఫాం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
