AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike loans: సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీతో లోన్స్‌ ఇస్తున్న టాప్‌ బ్యాంక్స్ ఇవే

కొత్త బైకుల ధరలు ఆకాశాన్నంటుతున్నందున, చాలా మంది సెకండ్ హ్యాండ్ బైక్‌లపై మొగ్గు చూపుతున్నారు. ఇది గమనించిన బ్యాంకులు ఇప్పుడు వాడిన బైక్‌ల కొనుగోలుకు ప్రత్యేక రుణాలు అందిస్తున్నాయి. తక్కువ వడ్డీ రేట్లతో, సులభమైన అర్హత నిబంధనలతో ఈ లోన్లు పొందవచ్చు. మంచి క్రెడిట్ స్కోర్, స్థిరమైన ఆదాయం ఉంటే ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని మీ కలల బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. అదెలానో తెలుసుకుందాం పండి.

Bike loans: సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీతో లోన్స్‌ ఇస్తున్న టాప్‌ బ్యాంక్స్ ఇవే
Second Hand Bike Loan
Anand T
|

Updated on: Jan 19, 2026 | 6:15 PM

Share

రోజురోజుకూ మార్కెట్‌లో వాహనాల రేట్లు పెరిగిపోతున్నాయి. దీంతో సమాన్యులు కనీసం బైక్‌ కొనాలన్నా ఆలోచించాల్సి పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు కేవలం రూ.50 వేలు పెడితే ద్విచక్ర వాహాన్ని కొనగలిగే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ప్రస్తుతం మార్కెట్‌లో బైక్ కొనాలంటే సుమారు రూ.లక్ష నుంచి 2లక్షల వరకు కావాలి. సామాన్య ప్రజలు ఇంత మొత్తండో డబ్బును పెట్టలేరు. దీంతో చాలా మంది సెకండ్ హ్యాండ్ బైక్స్ కొనాలి అనుకుంటున్నారు. అలాంటి వారికి కొన్ని బ్యాంక్‌లు గుడ్‌న్యూ్స్ చెబుతున్నారు. తక్కువ వడ్డీతో సెకండ్ హ్యాండ్ వాహనం కొనేందుకు లోన్స్‌ ఇస్తున్నాయి. అవును ఇది మేం చెబుతున్నది కాదు.. ఆయా సంస్థలే తమ బ్యాంక్‌లో సెకండ్ హ్యాండ్ వాహనాలపై కొనుగోలుకు లోన్స్ ఇస్తున్నట్టు ప్రకటించాయి.

2026 లో, అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సెకండ్ హ్యాండ్ బైక్‌లకు ప్రత్యేక రుణాలను అందిస్తున్నాయి. సాధారణంగా వాహనం మార్కెట్ విలువలో 70% నుండి 95% వరకు ఫైనాన్సింగ్ కవర్ చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని మీరు డైన్‌ పేమెంట్ కింద చెల్లించవచ్చు. మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కొనడానికి బ్యాంక్ లోన్ ఎలా పొందాలి అనుకుంటే మీరు ముందుగా ఏ బైక్ కొనాలో డిసైడ్ అయి. బ్యాంకులు అందించే యూజ్డ్ బైక్ లోన్, లేదా ఫ్రీ ఓన్డ్- టూ వీలర్ లోన్ కోసం అప్లై చేసుకోవాలి. వాళ్లు మీ బైక్‌ను బట్టి ఫైనాన్స్ కవరేట్‌ను చెబుతారు. దాన్ని బట్టి మీరు డైన్ పేమెంట్ కట్టి బైక్‌ను కొనవచ్చు.

ప్రస్తుతం మార్కెట్‌లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

సాధారణంగా సంవత్సరానికి 10% నుండి 18% వరకు వడ్డీ రేట్లు ఉంటాయి. అయితే కొన్ని NBFCలు మీ క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా దానిని 24% వరకు వసూలు చేయవచ్చు. సుమారుగా లోన్ పరిమితి ఏడాది నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. మీ బైక్‌ను బట్టి రూ.2 నుంచి 5లక్షల వరకు లోన్స్ ఇస్తారు.

మార్కెట్‌లో ఏ బ్యాంక్ ఎంత శాతం రుణాలు ఇస్తున్నాయో తెలుసుకోండి

బ్యాంక్ పేరు వడ్డీ రేటు  ఎన్ని సంవత్సరాలు  బైక్ ధరలో రుణశాతం 
ముత్తూట్ క్యాపిటల్ 0.99% 4 95%
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10.50% – 14.75% 5   85%
HDFC బ్యాంక్ 11.50% – 16.25% 4 100%
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 12.00% – 16.00% 5 90%
టీవీఎస్ క్రెడిట్ రుణదాత అభీష్టానుసారం 5 90%

లోక్‌ పొందేందుకు అర్హతలు

  • వయస్సు: కనీసం 21 సంవత్సరాలు, 60–65 సంవత్సరాల్లోపు తీసుకున్న రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
  • ఉపాధి: మీరు లోన్ పొందాలంటే మీరు ఒక ఉద్యోగి అయి ఉండాలి. మీరు కనీసం ఒక ఏడాది నుంచి జీతం పొందుతూ ఉండాలి. ఒక వేళ మీకు
  • వ్యాపారం ఉంటే అందులో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి
  • నెలవారీ ఆదాయం: మీరు లోన్ పొందాలంటే మీ నెలవారి ఆధాయం కనీసం రూ.10,000 నుండి రూ.15,000 వరకు ఉండాలి .
  • క్రెడిట్ స్కోర్: మీకు తక్కువ వడ్డీతో వెంటనే లోన్ అప్రూవ్ కావాలంటే మీరు సిబిల్‌ స్కోర్ మినిమం 700 అంతకంటే ఎక్కువ ఉండాలి.

మీరు లోన్ పొందాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్

  • పాన్ కార్డ్, ఆధార్, పాస్‌పోర్ట్ లేదా ఓటరు ID.
  • గత 3–6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, మీరు జాబ్ చేస్తుంటే మీ సాలరీ స్లిప్‌లు లేదా ITR.
  • మీ బైక్‌కు సంబంధించిన ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), చెల్లుబాటు అయ్యే బీమా, వాల్యుయేషన్ రిపోర్ట్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.