AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yuvraj Singh : విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే

Yuvraj Singh : కపిల్ శర్మ తన నెట్‌ఫ్లిక్స్ కామెడీ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో(సీజన్ 4)లో మరోసారి నవ్వుల విందు చేశారు. ఈసారి గెస్టులుగా వచ్చిన క్రికెట్ లెజెండ్స్ యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, మహమ్మద్ కైఫ్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేస్తూ యువీ చేసిన యాక్షన్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Yuvraj Singh : విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే
Yuvraj Singh Mimics Virat Kohli
Rakesh
|

Updated on: Jan 19, 2026 | 5:21 PM

Share

Yuvraj Singh : నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న కపిల్ శర్మ షో తాజా ఎపిసోడ్‌లో క్రికెట్ దిగ్గజాలు తమ పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. షో మధ్యలో కపిల్ శర్మ ఒక సరదా గేమ్ ఆడించారు. ఒకరు తన తలపై ఉన్న కార్డుపై ఉన్న పేరును చూసుకోకుండా, మిగిలిన ఇద్దరు ఇచ్చే క్లూలతో ఆ పేరును కనిపెట్టాలి. సెహ్వాగ్ తలపై ఉన్న కార్డు మీద విరాట్ కోహ్లీ పేరు రాసి ఉంది. ఈ క్లూ ఇచ్చే క్రమంలో యువరాజ్ సింగ్ తనదైన శైలిలో కోహ్లీ ముఖకవళికలను, పాత కాలపు దూకుడును ఇమిటేట్ చేశాడు. అది చూసిన సెహ్వాగ్ వెంటనే విరాట్ పేరు చెప్పేయడంతో సెట్ మొత్తం నవ్వులతో నిండిపోయింది.

షోలో నవ్వులు పూయించడానికి మరో కారణం కూడా ఉంది. ఆడియెన్స్ గ్యాలరీలో విరాట్ కోహ్లీలా ఉండే ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. వారిని చూసిన కపిల్ శర్మ తన మార్కు పంచ్‌లతో రెచ్చిపోయారు. “ఒకరు అచ్చు అసలు కోహ్లీలా ఉన్నారు.. కానీ ఇంకొకరు మాత్రం కోహ్లీని నీళ్లలో నానబెట్టి తీసినట్లు ఉన్నారు.. అందుకే కోహ్లీ కా కాస్త కోహ్లూ అయ్యాడు” అని జోక్ చేయడంతో గెస్టులు కిందపడి నవ్వుకున్నారు. యువరాజ్ కూడా వారిని చూస్తూ కోహ్లీ పాత కోపాన్ని గుర్తు చేస్తూ సైగలు చేయడం సోషల్ మీడియాలో హైలైట్ గా నిలిచింది.

విరాట్ కోహ్లీ కెరీర్ ప్రారంభంలో మైదానంలో చాలా దూకుడుగా ఉండేవారు. వికెట్ తీసినప్పుడు లేదా కోపం వచ్చినప్పుడు ఆయన అన్న ఒక హిందీ తిట్టు, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరులా వినిపిస్తుందని అప్పట్లో పెద్ద మీమ్ నడిచింది. యువరాజ్ సింగ్ కపిల్ షోలో ఏమీ మాట్లాడకుండానే ఆ మీమ్‌ను తన యాక్షన్‌తో గుర్తు చేశారు. “హస్నా నహీ థా.. బస్ యేహీ బోల్నా థా” (నవ్వకూడదు.. కేవలం ఇదే చెప్పాలి) అంటూ యువీ ఇన్ డైరెక్ట్ గా కోహ్లీ దూకుడును ప్రదర్శించడంతో జడ్జీలు అర్చన పురాణ్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ షాక్ అయ్యారు.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. యువీ టైమింగ్ ఎప్పటికీ సూపర్.. విరాట్ ని సరిగ్గా పట్టేశాడు అని కొందరు అంటుంటే, కోహ్లీ ఫామ్‌లో ఉంటే యువీ ఇలాంటి సరదా ఆటలు ఆడటం సహజమే అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. తాజాగా ఇండోర్ వన్డేలో కోహ్లీ సెంచరీ బాదడంతో, యువీ ఇన్స్టాగ్రామ్ లో కూడా కోహ్లీని కొనియాడుతూ పోస్ట్ పెట్టారు. మైదానం వెలుపల వీరు పంచుకునే స్నేహం అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..