AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: అమృత్‌ టెండర్లపై పొలిటికల్ వార్.. కాంగ్రెస్ సర్కార్ టార్గెట్‌గా ఢిల్లీ బయలుదేరిన కేటీఆర్‌.. కేంద్రమంత్రితో భేటీ..!

పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్న కేటీఆర్‌... అమృత్‌ టెండర్ల గురించి ఫిర్యాదు చేయనున్నారు. రేవంత్‌ బావమరిది సృజన్‌రెడ్డికి లాభం చేకూరేలా అధికార దుర్వినియోగం చేశారని... గతంలోనే ఈ అంశంపై కేంద్రమంత్రికి లేఖ రాసిన KTR ఇప్పుడు నేరుగా కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు.

KTR: అమృత్‌ టెండర్లపై పొలిటికల్ వార్.. కాంగ్రెస్ సర్కార్ టార్గెట్‌గా ఢిల్లీ బయలుదేరిన కేటీఆర్‌.. కేంద్రమంత్రితో భేటీ..!
KTR
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: Nov 11, 2024 | 2:16 PM

Share

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి సీఎం రేవంత్‌ టార్గెట్‌గా ఢిల్లీ బయలుదేరారు.. అమృత్‌ పథకంలో స్కామ్‌ జరిగిందంటున్న కేటీఆర్‌.. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు హస్తినకు బయలుదేరారు.. గతంలోనూ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. అయితే.. ఇలా ఫిర్యాదు చేయడం సాధారణ విషయమైనా… అమృత్ స్కాంపై కంప్లైంట్ మాత్రం కొంత ప్రత్యేకమైనది. అమృత్ స్కీంకు సంబంధించి నిధులను కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు మంజూరు చేస్తుంది. రాష్ట్రాల్లో నిధులను పట్టణాభివృద్ధి అవసరాల కోసం టెండర్ల ద్వారా కేటాయిస్తారు. అయితే, కేంద్రం అమృత్ పథకం ద్వారా ఇచ్చిన 8888 కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిది సూదిని సృజన్ రెడ్డికి ఏకపక్షంగా కట్టపెట్టారు అనేది కేటీఆర్ చేస్తున్న ఆరోపణ.. అమృత్‌ టెండర్లలో రేవంత్‌ బావమరిది సృజన్‌రెడ్డికి.. లాభం చేకూరేలా అధికార దుర్వినియోగం చేశారని కేటీఆర్‌ ఆరోపిస్తున్నారు.

ఇందులో భాగంగానే వ్యూహాత్మకంగా IHP అనే కంపెనీని తీసుకొచ్చి.. వాడితో సుజన్ రెడ్డికి చెందిన శోధన కంపెనీకి జాయింట్ వెంచర్ ఇప్పించి మరీ ఈ టెండర్లను కట్టబెట్టారు అంటూ.. ఆధారాలతో సహా కేటీఆర్ గతంలోని పలు ప్రెస్‌మీట్లలో చెప్పారు. దాంతోపాటుగా ఈ టెండర్లకు సంబంధించిన జీవోలు కూడా రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారంటూ ప్రశ్నిస్తూ వస్తున్నారు.

అయితే.. అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్ ఆరోపణల తర్వాత సృజన్ రెడ్డి కేటీఆర్ కు లీగల్ నోటీసు పంపించారు. ఆరోపణలను వెనక్కి తీసుకోకపోతే పరువు నష్టం దాబా వేస్తామంటూ ఆ నోటీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత ట్విట్టర్లో కేటీఆర్ మరిన్ని ఆధారాలను చూపించారు.

ఇప్పుడు ఏకంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ అపాయింట్మెంట్ తీసుకుని ఆధారాలు పట్టుకుని ఢిల్లీకి వెళ్తున్నారు కేటీఆర్.. గతంలోనే ఈ అంశంపై కేంద్రమంత్రికి లేఖ రాసిన KTR ఇప్పుడు నేరుగా కలిసి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నారు.

అమృత్ స్కాం కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలు జరిగాయి.. ఏకపక్షంగా టెండర్లను ఎలా కట్టబెట్టారని కేటీఆర్.. ఆధారాలతో సహా ఫిర్యాదు చేయబోతున్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై కేంద్రం విచారణకు ఆదేశిస్తే మాత్రం.. మూడు పార్టీల మధ్య మరో రాజకీయ రగడ మారనుంది.. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS పార్టీ బిజెపికి ఫిర్యాదు చేయడం ఆసక్తిగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..