AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మా ఫ్యామిలీకి సిటివ్వండి ప్లీజ్.. ఎంపీ టిక్కెట్ల కోసం క్యూ కట్టిన కాంగ్రెస్ కీలక నేతలు..

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఒకరిద్దరు నేతలు సైతం తమ కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అంజన్ కుమార్.. తన కొడుకు అనిల్ కుమార్ టికెట్ కోసం కాంగ్రెస్ పెద్దలను అడిగినట్లు తెలుస్తోంది. ఇక తనకి లేదా తన కుటుంబ సభ్యులలో ఒకరికి టికెట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధిష్ఠానాన్ని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ సైతం తనకి నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.

Telangana: మా ఫ్యామిలీకి సిటివ్వండి ప్లీజ్.. ఎంపీ టిక్కెట్ల కోసం క్యూ కట్టిన కాంగ్రెస్ కీలక నేతలు..
Telangana Congress
Ashok Bheemanapalli
| Edited By: Venkata Chari|

Updated on: Feb 07, 2024 | 1:33 PM

Share

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీట్ల కోసం భారీగా డిమాండ్ నెలకొంది. పెద్ద లీడర్లు సైతం తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ్ముడి కోసం అన్న, భార్య కోసం భర్త, కూతురు కోసం తండ్రి టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండడం, కాంగ్రెస్ పార్టీకి ఊపు ఉండడంతో హస్తం పార్టీ నుంచి టికెట్ ఇప్పించుకోవాలని బడా నేతలు సైతం పావులు కదుపుతున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడే తమ కుటుంబ సభ్యులను రాజకీయంగా సెట్ చేయాలని కసరత్తు చేస్తున్నారు.

ఖమ్మం ఎంపీ టిక్కెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం నుంచి భారీ ర్యాలీగా వచ్చి దరఖాస్తు చేసిన నందిని.. తనకే టిక్కెట్ వస్తుందని ధీమాగా ఉన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి కూడా ఖమ్మం ఎంపీ టిక్కెట్ కోసం దరఖాస్తు చేశారు. ఇద్దరు మంత్రులు తమ కుటుంబ సభ్యుల కోసం ఒకే సెగ్మెంట్ టికెట్ కోసం పోటీ పడుతుండడం హాట్ టాపిక్ గా మారింది.

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి నల్గొండ ఎంపీ టిక్కెట్ కోసం దరఖాస్తు చేశారు. జానారెడ్డి రెండో కొడుకు జైవీర్ నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉండగా.. ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం ఇంకో కొడుకు రఘువీర్ అప్లయ్ చేసుకున్నారు. అయితే, ఇదే టిక్కెట్ కోసం మంత్రి కోమటిరెడ్డి ఫ్యామిలీ కూడా ప్రయత్నిస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరు మంత్రిగా, మరొకరు ఎమ్మేల్యేగా ఉండగా తమ కుటుంబానికి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి నల్గొండ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూతురు సైతం నల్గొండ టికెట్ ఆశిస్తున్నట్లు వినిపిస్తోంది. తమ కుటుంబంలో ఎవరికి టికెట్ ఇచ్చినా తమకు ఒకే అని కోమటిరెడ్డి ఫ్యామిలీ భావిస్తోంది.

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కూతురు కీర్తి రెడ్డి భువనగిరి ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. టికెట్ కోసం గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకున్న కీర్తి రెడ్డి టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు.

మెదక్ ఎమ్మేల్యే మైనంపల్లి రోహిత్ తన తండ్రికి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి టిక్కెట్ కోసం మైనంపల్లి హాన్మంతరావు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ఇక నాగర్ కర్నూలు ఎంపీ టిక్కెట్ కోసం మల్లు రవి దరఖాస్తు చేసుకున్నాడు. ఇక మల్లు బ్రదర్స్ లో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఏం గా ఉండగా, భట్టి సోదరుడు మల్లు రవి నాగర్ కర్నూల్ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న మల్లు రవి టికెట్ కోసం అవసరమైతే తన పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరో మంత్రి దామోదర రాజనర్సింహ కూతురు సైతం ఎంపీ టికెట్ కోసం ఆశిస్తున్నారు. జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని దామోదర కూతురు త్రిష భావిస్తున్నారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఒకరిద్దరు నేతలు సైతం తమ కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అంజన్ కుమార్.. తన కొడుకు అనిల్ కుమార్ టికెట్ కోసం కాంగ్రెస్ పెద్దలను అడిగినట్లు తెలుస్తోంది. ఇక తనకి లేదా తన కుటుంబ సభ్యులలో ఒకరికి టికెట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధిష్ఠానాన్ని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ సైతం తనకి నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.

టికెట్ల కోసం అధిష్ఠానంపై భారీ ఒత్తిడి ఉన్నప్పటికీ గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక ఈ ప్రయత్నంలో ఏ ఫ్యామిలీ సక్సెస్ అవుతుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!