Old Age Couple: ఎంత కష్టమొచ్చిందో.. కన్నీరు తెప్పిస్తోన్న వృద్ధ దంపతుల ఆత్మహత్య..!
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం ఆగా మోత్కూర్ గ్రామానికి చెందిన మల్లెబోయిన లింగయ్య (86), పెంటమ్మ(80) దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఉన్నంతలో పిల్లలను అల్లారు ముద్దుగా పెంచారు. వారికి ఉన్న వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ పిల్లలను పెద్దచేసి.. పెళ్లిళ్లు చేశారు. లింగయ్యకు ఉన్న మూడెకరాల సాగు భూమిని ముగ్గురు కొడుకులకు ఇటీవలే పంచాడు.

అడ్డాలనాడు బిడ్డలు కానీ.. గడ్డాల నాడు బిడ్డలు కాదన్న నానుడి నిజమవుతుంది..! వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కన్న బిడ్డలకు భారమవుతున్నారు. నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులు.. పిల్లల ఆదరణకు నోచుకోలేక పోతున్నారు. వృద్ధాప్యంతో వచ్చే అనారోగ్య సమస్యలు.. ఆ దంపతులను ఇబ్బంది పెట్టలేక పోయినా, 80 ఏళ్లుపైబడ్డ తమను సంతానం పట్టించుకోవడం లేదని కుమిలిపోయారు. తీవ్ర మనోవేదనకు గురై ఆ వృద్ద దంపతులు, పురుగులమందు తాగారు. భర్త మృతి చెందగా, భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్లాడుతోంది.
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం ఆగా మోత్కూర్ గ్రామానికి చెందిన మల్లెబోయిన లింగయ్య (86), పెంటమ్మ(80) దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఉన్నంతలో పిల్లలను అల్లారు ముద్దుగా పెంచారు. వారికి ఉన్న వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ పిల్లలను పెద్దచేసి.. పెళ్లిళ్లు చేశారు. లింగయ్యకు ఉన్న మూడెకరాల సాగు భూమిని ముగ్గురు కొడుకులకు ఇటీవలే పంచాడు. పెద్ద కొడుకు సైదులు మండలంలోని యాద్గిరిపల్లిలో ఉంటున్నాడు. అదే గ్రామంలో ఉండే రెండో కొడుకు రాములు చనిపోగా, చిన్న కొడుకు శ్రీను కూడా ఆగా మోత్కూరులో వేరుగా ఉంటున్నాడు.
ఆగా మోత్కూర్‌లో ఉంటున్న లింగయ్య దంపతులు భూమి పంపిణీకి ముందు రైతుబంధుతో పాటు పింఛన్ డబ్బులతో జీవితం గడిచేది. ఈ దంపతులు వృద్ధాప్య సమస్యలతో పాటు కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కొంత కాలంగా కొడుకులు తమను ఆదరించకపోవడంతో వృద్ధ దంపతులు మనస్తాపం చెందారు. కాలు కదపలేని వయసులో చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో వృద్ధుల దంపతులు ఇబ్బందులు పడ్డారు. తమను కొడుకులు ఆదరించలేదనే కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేక దుఃఖాన్ని దిగమింగుతూ అనంతలోకాలకు పయనమే శరణమనుకున్నారు. ఇద్దరు ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య ఒడిగట్టారు.
ఇంట్లోనే ఇద్దరూ పురుగుల మందు తాగి సొమ్మసిల్లి పడిపోయారు. స్థానికులు గమనించేసరికి లింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అపస్మారక స్థితిలో భార్య పెంటమ్మను నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
