Bandi Sanjay: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై మండిపడ్డ బండి సంజయ్

మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై బండి సంజయ్ మండిపాడ్డారు. భాష పట్ల నేతలు హద్దుల్లో ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు హద్దు మీరుతున్నారని, సీఎంను చెప్పుతో కొడతా అనడం తప్పని, ఇంతకంటే సిగ్గు చేటు ఉంటుందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అహంకారం బయటకు వస్తోందని, సీఎం కుర్చీకి గౌరవం ఇవ్వాలని, ముఖ్యమంత్రినే చెప్పుతో..

Bandi Sanjay: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై మండిపడ్డ బండి సంజయ్

|

Updated on: Feb 07, 2024 | 1:09 PM

ఈనెలలోనే పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ వస్తోంది. ఈలోపే కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు బండి సంజయ్‌. షెడ్యూల్‌ వచ్చేదాకా జాప్యం చేసి తప్పించుకునే యోచనలో కాంగ్రెస్‌ ఉందంటూ ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌‌, కాంగ్రెస్‌ రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు బండి. హామీల అమలుపై దృష్టి మళ్లించాలని కాంగ్రెస్‌ చూస్తుంటే.. గత ప్రభుత్వ తప్పిదాలు బయటకు రాకుండా ప్రజల దృష్టి మళ్లించాలని బీఆర్‌ఎస్‌‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై బండి సంజయ్ మండిపాడ్డారు. భాష పట్ల నేతలు హద్దుల్లో ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు హద్దు మీరుతున్నారని, సీఎంను చెప్పుతో కొడతా అనడం తప్పని, ఇంతకంటే సిగ్గు చేటు ఉంటుందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అహంకారం బయటకు వస్తోందని, సీఎం కుర్చీకి గౌరవం ఇవ్వాలని, ముఖ్యమంత్రినే చెప్పుతో కొడతా అనడం కరెక్ట్ కాదని బండి సంజయ్ అన్నారు.

Follow us