Live In Relationship: పెళ్లి కాకుండా కలిసున్నా.. రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే.! లేదా జైలు శిక్ష.

Live In Relationship: పెళ్లి కాకుండా కలిసున్నా.. రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే.! లేదా జైలు శిక్ష.

Anil kumar poka

|

Updated on: Feb 07, 2024 | 5:29 PM

రానున్న రోజుల్లో మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌లాగే లివ్‌-ఇన్‌ రిజిస్ట్రేషన్స్‌ కూడా రాబోతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే.. ఉత్తరాఖండ్‌ లో యూనిఫాం సివిల్ కోడ్ అమలులోకి రానుంది. ఆ రాష్ట్రంలో లివ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉండాలనుకుంటున్న జంటలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవలసి ఉంటుంది. లేదంటే కటకటాల వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టింది.

రానున్న రోజుల్లో మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌లాగే లివ్‌-ఇన్‌ రిజిస్ట్రేషన్స్‌ కూడా రాబోతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే.. ఉత్తరాఖండ్‌ లో యూనిఫాం సివిల్ కోడ్ అమలులోకి రానుంది. ఆ రాష్ట్రంలో లివ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉండాలనుకుంటున్న జంటలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవలసి ఉంటుంది. లేదంటే కటకటాల వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాల నడుమ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ కోడ్‌ అమలులోకి వస్తే ఉత్తరాఖండ్‌ యూసీసీ అమలుచేసే తొలిరాష్ట్రంగా నిలవనుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సీఎం ధామీ ప్రభుత్వానికి సమర్పించిన యూసీసీ ముసాయిదాలో ఈ నిబంధన గురించి పేర్కొన్నారు. ఈ బిల్లు కనుక ఆమోదం పొంది చట్టంగా మారితే లివిన్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాలనుకుంటున్న యువతీయువకులతోపాటు ఇప్పటికే అందులో ఉన్నవారు తప్పకుండా జిల్లా అధికారుల వద్ద తమ బంధాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

అంతేకాదు, వారి వయసు 21 నిండి ఉండడంతోపాటు తల్లిదండ్రుల అనుమతి కూడా అవసరం. అయితే, ఇది ప్రజా నైతికతకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం రిజిస్టర్ చేయరు. అంటే జంటలో ఒకరికి ఇప్పటికే వివాహమైనా, మరొకరితో రిలేషన్‌లో ఉన్నా, భాగస్వామి మైనర్ అయినా ఆ బంధాన్ని రిజిస్టర్ చేయరు. అలాగే, బలవంతంగా కానీ, గుర్తింపు వంటివాటిని తప్పుగా చూపించే ప్రయత్నం చేసినా చిక్కుల్లో పడడం ఖాయం. ఇటువంటి రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్నాక రిజిస్ట్రార్ వారికి రిజిస్ట్రేషన్ రసీదుని అందజేస్తారు. ఆ రశీదు ఆధారంగా ఆ జంట ఇల్లు లేదా హాస్టల్ లేదా పీజీని అద్దెకు తీసుకోవచ్చు. లివ్ ఇన్‌లో ఉంటున్న సమయంలో ఆ జంటకు పుట్టిన పిల్లలు ఆ జంటకు చెందిన చట్టబద్ధమైన పిల్లలుగా గుర్తింపు పొందుతారు. అలాంటి పిల్లలు వారి తల్లిదండ్రుల ఆస్తులపై అన్ని హక్కులను పొందుతారు. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నవారు విడిపోవాలనుకున్నా, తిరిగి ఆ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..