Online: ట్రైన్, ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తున్నారా.. ఈ విషయంలో బీ అలర్ట్..

ఐజీఎస్ డిజిటల్ సర్వీస్ పేరు ప్రజలను బురిడీ కొట్టిస్తున్న నేరగాళ్లను అరెస్ట్ చేశారు పంజాగుట్ట పోలీసులు. ఈ సంస్థ డిజిటల్ సేవలు అందిస్తామని ఆన్లైన్ లో ప్రకటనలు ఇస్తున్నట్లు గుర్తించారు. రైల్వే, విమాన సహా 300 రకాల సేవలు అందిస్తామని ప్రకటనలు వస్తూ ఉండేవని తెలిపారు పోలీసులు.

Online: ట్రైన్, ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తున్నారా.. ఈ విషయంలో బీ అలర్ట్..
Cyber Crime
Follow us

| Edited By: Srikar T

Updated on: Feb 07, 2024 | 1:37 PM

ఐజీఎస్ డిజిటల్ సర్వీస్ పేరు ప్రజలను బురిడీ కొట్టిస్తున్న నేరగాళ్లను అరెస్ట్ చేశారు పంజాగుట్ట పోలీసులు. ఈ సంస్థ డిజిటల్ సేవలు అందిస్తామని ఆన్లైన్ లో ప్రకటనలు ఇస్తున్నట్లు గుర్తించారు. రైల్వే, విమాన సహా 300 రకాల సేవలు అందిస్తామని ప్రకటనలు వస్తూ ఉండేవని తెలిపారు పోలీసులు. ప్రకటనలు చూసి సంప్రదించిన వారిని ఐడి క్రియేట్ చేసుకోవాలని టెలి కాలర్లు చెప్తు మోసాలకు పాల్పడేవారు. ఐడి రిజిస్ట్రేషన్ కోసం తొలుత 1800 కట్టించుకుంటున్న నేరగాళ్లు.. తర్వాత కేవైసి సహా పలు రకాల పేర్లతో వేల రూపాయలు కాజేస్తున్నారు.

ఈ సైబర్ నేరగాళ్లు రాజస్థాన్ లోని జైపూర్ ను ప్రధాన కేంద్రంగా ఎంపిక చేసుకుని ఐజీఎస్ లిమిటెడ్ అనే పేరుతో డిజిటల్ సెంటర్ నడిపిస్తున్నారు.  బేగంపేట వైట్ హౌస్ భవనంలో నిర్వహిస్తున్న కాల్ సెంటర్ ను గుర్తించారు పోలీసులు. బాధితుడి ఫిర్యాదుతో కాల్ సెంటర్ పై దాడులు నిర్వహించిన పోలీసులు.. సీఈఓ ప్రతీక్ చావే, హెచ్ ఆర్ దాసరి స్వర్ణలత, శ్రవణ్ లాల్ శర్మ లను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. దేశ వ్యాప్తంగా నేరాలకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు వీరిపై సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో 50 కి పైగా కేసులు రిపోర్ట్ అయినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..