Video: ఇంటికి తాళంవేసి పొలానికి వెళ్లారు.. కట్‌చేస్తే.. తిరిగొచ్చి చూడగా..

Telangana: ఏదో పని మీద అప్పుడే హిర్య నాయక్ పొలం నుంచి ఇంటికి వస్తుండగా.. కాంపౌండ్ వాల్ దూకి ఓ వ్యక్తి పారిపోతుండడం గమనించాడు. దీంతో ఎవరని ప్రశ్నించాడు. మీ ఇంటికి నంబర్ వేయడానికి వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి హడావుడిగా బండిపై వెళ్ళిపోయారు. హిర్య నాయక్ గేటు తాళం తీసి లోపలికి వెళ్లి చూడగా లోపల తాళం విరగొట్టి ఉండడం చూసి చోరీ జరిగిందని భావించి స్థానికుల దృష్టికి తీసుకెళ్లాడు.

Video: ఇంటికి తాళంవేసి పొలానికి వెళ్లారు.. కట్‌చేస్తే.. తిరిగొచ్చి చూడగా..
Vikarabad Robery
Follow us

| Edited By: Venkata Chari

Updated on: Feb 07, 2024 | 12:42 PM

వికారాబాద్ జిల్లా పరిగి మండలం సోండేపూర్ గిరిజన తాండాలో పట్ట పగలే ఓ ఇంట్లో చోరీ జరిగింది. పక్కా స్కెచ్‌తో ఓ ఇంటి ప్రహారీ గోడ దూకి చోరీకి తెగబడ్డారు గుర్తు తెలియని దొంగలు. తాండాకు చెందిన హర్యానాయక్, అతని భార్య ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్ళారు. అదే అదునుగా భావించిన ఇద్దరు దొంగలు స్కూటిపై వచ్చి హర్య నాయక్ ఇంటి వద్ద రెక్కీ చేశారు. ఎవరు లేరని నిర్దారించుకున్నారు. ఒకడు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తుండగా.. మరొకడు బండిపై అటూ ఇటూ తిరుగుతూ జనాల రాకపోకలను గమనిస్తున్నాడు.

ఏదో పని మీద అప్పుడే హిర్య నాయక్ పొలం నుంచి ఇంటికి వస్తుండగా.. కాంపౌండ్ వాల్ దూకి ఓ వ్యక్తి పారిపోతుండడం గమనించాడు. దీంతో ఎవరని ప్రశ్నించాడు. మీ ఇంటికి నంబర్ వేయడానికి వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి హడావుడిగా బండిపై వెళ్ళిపోయారు. హిర్య నాయక్ గేటు తాళం తీసి లోపలికి వెళ్లి చూడగా లోపల తాళం విరగొట్టి ఉండడం చూసి చోరీ జరిగిందని భావించి స్థానికుల దృష్టికి తీసుకెళ్లాడు.

బీరువా తెరిచి చూసి షాకయ్యాడు. బీరువాలో ఉన్న బంగారం, వెండి నగలు కనిపించలేదని వాపోయాడు. నాలుగు తులాల బంగారం, 45 తులాల వెండి దొంగతనం అయినట్లు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చేతిలో రాడ్డుతో కాంపౌండ్ వాల్ దూకి ఇంట్లో వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారత్ పునర్నిర్మాణంలో ప్రధాని మోదీ వ్యూహాలు.. విదేశాంగ విధానంలో..
భారత్ పునర్నిర్మాణంలో ప్రధాని మోదీ వ్యూహాలు.. విదేశాంగ విధానంలో..
బాలాపూర్‌లో మొదలైన పూజా కార్యక్రమం.. లడ్డూ వేలానికి సర్వం సిద్ధం
బాలాపూర్‌లో మొదలైన పూజా కార్యక్రమం.. లడ్డూ వేలానికి సర్వం సిద్ధం
సినీ నటి జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్
సినీ నటి జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్
కాసేపట్లో ప్రారంభం కానున్న ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర ..
కాసేపట్లో ప్రారంభం కానున్న ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర ..
Horoscope Today: వారికి అనుకోకుండా ఆదాయ వృద్ధి..
Horoscope Today: వారికి అనుకోకుండా ఆదాయ వృద్ధి..
పద్దతిగా కనిపిస్తూనే పరువాలతో కట్టిపడేస్తున్న ప్రియా ప్రకాష్
పద్దతిగా కనిపిస్తూనే పరువాలతో కట్టిపడేస్తున్న ప్రియా ప్రకాష్
కొన్ని రోజుల్లో హర వీరమల్లు రీ స్టార్ట్‌..
కొన్ని రోజుల్లో హర వీరమల్లు రీ స్టార్ట్‌..
TVS నుంచి సరికొత్త బైక్‌.. గంటకు 215.9 కి.మీ వేగం.. ధర, ఫీచర్స్
TVS నుంచి సరికొత్త బైక్‌.. గంటకు 215.9 కి.మీ వేగం.. ధర, ఫీచర్స్
పని మనిషిగా ఓ మంత్రి కుమార్తె మా ఇంట్లో చేరింది
పని మనిషిగా ఓ మంత్రి కుమార్తె మా ఇంట్లో చేరింది
చూస్తుండగానే నడిరోడ్డుపై భారీ గొయ్యి !! కాస్తయితే మింగేసేదే !!
చూస్తుండగానే నడిరోడ్డుపై భారీ గొయ్యి !! కాస్తయితే మింగేసేదే !!