తెల్లారి మద్యం షాప్ ఓపెన్ చేయగా.. ఎదురుగా కనిపించిన దృశ్యానికి గుండె గుభేల్..
మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట సమీపంలోని వైన్ షాపులో చోరి జరిగింది. సీసీ కెమెరాలను ధ్వంసం చేసి దుండగులు మద్యాన్ని ఎత్తుకెళ్లారు. అదే విధంగా సీసీ ఫుటేజీ నిక్షిప్తమయ్యే డీవీఆర్ బాక్స్‌ను సైతం దొంగలు పట్టుకెళ్లారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. మూసాపేట వైన్ షాపును సంకలమద్ది శివారులో వేముల రోడ్డు పక్కన ఏర్పాటు చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట సమీపంలోని వైన్ షాపులో చోరి జరిగింది. సీసీ కెమెరాలను ధ్వంసం చేసి దుండగులు మద్యాన్ని ఎత్తుకెళ్లారు. అదే విధంగా సీసీ ఫుటేజీ నిక్షిప్తమయ్యే డీవీఆర్ బాక్స్‌ను సైతం దొంగలు పట్టుకెళ్లారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. మూసాపేట వైన్ షాపును సంకలమద్ది శివారులో వేముల రోడ్డు పక్కన ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే రాత్రి వైన్ షాపును మూసి నిర్వాహకులు ఇంటికి వెళ్లిపోయారు. అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు షాపు పక్కన ఉన్న షట్టర్‌ను విరగొట్టి లోపలికి వెళ్లారు. అందులో ఉన్న మద్యాన్ని తీసుకెళ్లారు. అయితే దొంగలు పోతూ.. పోతూ.. సీసీ ఫుటేజ్ నిక్షిప్తమయ్యే డీవీఆర్ బాక్సును సైతం ఎత్తుకెళ్లారు.
షాపు తెరిచేందుకు వచ్చిన యజమానికి షాక్..
ఉదయం షాపు తెరవడానికి వచ్చిన నిర్వాహకులు షాక్ గురయ్యారు. షాపులో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మహబూబ్‌నగర్ నుంచి వచ్చిన క్లూస్ టీం బృందం ఆధారాలను సేకరించింది. వైన్ షాపులో సుమారు రూ.5.20 లక్షల మద్యాన్ని దొంగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. తెచ్చిన గంటల వ్యవధిలోనే మద్యం స్టాక్‌ను దొంగలు మాయం చేయడంతో నిర్వహకులు లబోదిబోమంటున్నారు.
అనుమానాస్పదంగా మద్యం దొంగతనం..
మద్యం చోరి జరిగిన తీరుపై పలు అనుమానాలకు తావిస్తోంది. డిస్టీలరీ నుంచి సోమవారం రాత్రే వైన్ షాపునకు మద్యం స్టాక్ తెప్పించారు నిర్వాహకులు. అదే రోజు అర్ధరాత్రి మద్యం దొంగలించారు దొంగలు. దీంతో పాటుగా వైన్ షాపు పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉండడంతో చోరీ వ్యవహారం చర్చనీయంశంగా మారింది. మద్యం స్టాక్ వచ్చిన విషయం తెలిసే దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వైన్స్ ఉన్న ప్రాంతం సైతం శివారులో చుట్టుపక్కల నిర్మానుష్యంగా ఉండడంతో దొంగలు తమ పనిని సాఫీగా చేసుకొని వెళ్లిపోయారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..