AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీఆర్‌ఎస్‌ సభకు పోటీగా కాంగ్రెస్‌ సభ.! ఆ రోజే మరో రెండు గ్యారంటీల అమలు ప్రకటన..

నల్గొండలో బీఆర్‌ఎస్‌కు పోటీగా భారీ సభకు ప్లాన్‌ చేస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సమావేశమైన పీఈసీ.. లోక్‌సభ ఎన్నికలతో పాటు తాజా రాజకీయ అంశాలపైనా చర్చించింది. కాళేశ్వరం కుంగిన అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు స్పష్టంచేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

బీఆర్‌ఎస్‌ సభకు పోటీగా కాంగ్రెస్‌ సభ.! ఆ రోజే మరో రెండు గ్యారంటీల అమలు ప్రకటన..
CM Revanth Reddy
Ravi Kiran
|

Updated on: Feb 07, 2024 | 7:30 AM

Share

నల్గొండలో బీఆర్‌ఎస్‌కు పోటీగా భారీ సభకు ప్లాన్‌ చేస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సమావేశమైన పీఈసీ.. లోక్‌సభ ఎన్నికలతో పాటు తాజా రాజకీయ అంశాలపైనా చర్చించింది. కాళేశ్వరం కుంగిన అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు స్పష్టంచేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటిన హస్తం పార్టీ. పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. అయితే టికెట్‌ ఆశించే నేతల జాబితా భారీగా ఉండడంతో.. అభ్యర్ధుల వడపోతపై దృష్టిసారించింది అధిష్ఠానం. టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్‌లో సమావేశమైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ.. పార్లమెంటుకు పోటీచేసే అభ్యర్ధుల జాబితాపై చర్చించింది. నియోజకవర్గాల వారీగా ఇద్దరు లేక ముగ్గురు నేతలను పీఈసీ ఎంపిక చేసి ఆ జాబితాను కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన ఈ విధానాన్నే పార్లమెంటు ఎలక్షన్స్‌లోనూ ఫాలో అవుతోంది హస్తం పార్టీ. పీఈసీలో కీలక అంశాలపై మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. తెలంగాణలో 15 లోక్‌సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పారు.

టికెట్‌ ఆశించే నేతల సంఖ్య వందల సంఖ్యలో ఉండడంతో అభ్యర్థుల ఎంపిక.. పార్టీకి కష్టంగా మారినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు 309 మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్లు ఇస్తామని పీఈసీ సభ్యుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. దరఖాస్తు చేయనివారి పేర్లనూ పరిశీలిస్తామని.. అభ్యర్థుల ఎంపికలో అధిష్ఠానానిదే తుది నిర్ణయమని తేల్చిచెప్పారు. రానున్న ఎన్నికల్లో 13 సీట్లకు తగ్గకుండా ఎంపీ సీట్లు గెలవడానికి కృషి చేయాలని కాంగ్రెస్ పీఈసీ తీర్మానం చేసింది. అభ్యర్థుల ఎంపికతో పాటు తాజా రాజకీయ అంశాలపైనా చర్చ జరిపారు నేతలు.

కాళేశ్వరం కుంగిన అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని.. పార్టీ నేతలను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బీఆర్‌ఎస్‌ సభకు పోటీగా నల్గొండ పార్లమెంట్‌ పరిధిలో 2 లక్షల మందితో సభ పెట్టాలని కోరారు మంత్రి కోమటిరెడ్డి. ఈ సభకు ప్రియాంక గాంధీని పిలవాలని నిర్ణయించారు. ఇక కాంగ్రెస్‌కు పరిపాలన చేతకాలేదన్న బీఆర్‌ఎస్‌ కౌంటర్‌ ఇచ్చారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఓవైపు పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధం అవుతూనే మరోవైపు బీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొవాలని నిర్ణయించింది కాంగ్రెస్‌ పార్టీ. అందులో భాగంగానే పీఈసీలో నేతలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.