AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై ఆ నియోజకవర్గంలో కొనసాగుతున్న ఉత్కంఠ..

పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‎ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. పార్టీ నాయకులు కూడా ఒకింత షాక్ అవుతున్న పరిస్థితి నెలకొంది. అధినాయకత్వం వ్యవహరించిన తీరుపై లోక్ సభ పరిధిలోని నాయకులు మౌనం వహించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన చేరిక వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం ఉంటుందా లేదా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించిన తీరుపై కూడా విస్మయం వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై ఆ నియోజకవర్గంలో కొనసాగుతున్న ఉత్కంఠ..
Telangana Congress
G Sampath Kumar
| Edited By: |

Updated on: Feb 07, 2024 | 4:35 PM

Share

పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‎ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. పార్టీ నాయకులు కూడా ఒకింత షాక్ అవుతున్న పరిస్థితి నెలకొంది. అధినాయకత్వం వ్యవహరించిన తీరుపై లోక్ సభ పరిధిలోని నాయకులు మౌనం వహించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన చేరిక వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం ఉంటుందా లేదా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించిన తీరుపై కూడా విస్మయం వ్యక్తమవుతోంది.

లాభమేనా..?

వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల పార్టీకి ఒరేగేదిమిటీ అన్న విషయంపై కొంత మంది ముఖ్య నాయకులు అధిష్టానానికి వివరించేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ ఆయన వల్ల లాభం ఏమీ ఉండబోదన్న వాదనలు వినిపించాలని చూస్తున్నారు. ఏడు సెగ్మెంట్లలో ఏ మాత్రం ప్రభావం చూపించే అవకాశం లేదని, ఆయనను చేర్చుకోవడం వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయాలే పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో మారుతున్న సమీకరణాలను దృష్టిలో పెట్టుకున్న వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారని, సిట్టింగ్ ఎంపీగా మాత్రం ఆయన ప్రభావితం చూపే అవకాశమే లేదని అంటున్నవారే ఎక్కువ. నియోజకవర్గంలో నామమాత్రంగా క్యాడర్ ఉన్న ఆయనతో పార్టీకి లాభం జరుగుతుందని అంచనా వేయడం కూడా సరికాదని ఓ సెగ్మెంట్‎కు చెందిన నాయకుడు అధిష్టానానికి వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

మారిన సీన్..

పెద్దపల్లి లోక్ సభ నుండి టికెట్ల కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య పెద్దగానే ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద తనయుడు వంశీ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టేనని అనుకున్న క్రమంలోనే కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆశావాహులు క్యూ కడుతున్నారు. గతంలో ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన సిహెచ్ సుగుణ కుమారి, ఇక్కడి నుండి పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నేత గోమాస శ్రీనివాస్, మాజీ మంత్రి చంద్ర శేఖర్‎తో పాటు పలువురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరో ఒకరి అభ్యర్థిత్వం ఖరారు అవుతుందని భావిస్తున్న క్రమంలో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ ను పార్టీలో చేర్చుకోవడంతో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఆశావాహులు తమనే అభ్యర్థిగా ప్రకటించాలని అధిష్టానాన్ని కోరుతున్న క్రమంలో.. వెంకటేష్ ఎపిసోడ్ కొత్త చర్చకు దారితీసింది. ఆయనకు అధిష్టానం ఎలాంటి హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకుంది..? సిట్టింగ్ అయినందున ఆయనకే టికెట్ ఇస్తారా.. లేక టికెట్ రేసులో ఉన్న తమలో ఎవరో ఒకరికి ఇస్తారా అన్న విషయంపై ఆశావహుల్లో తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఏది ఏమైనా పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలో మాత్రం అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..