Ayodhya Ram Mandir: ప్రతి ఇంటికి అయోధ్య రామ మందిర చిత్ర పటం పంపిణి.. ఏర్పాట్లు పూర్తి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికులు అయోధ్య వెళ్లాలని, శ్రీరామ చంద్రుడిని దర్శించాలని ఆశిస్తున్న వారే ఎక్కువ. ఈ నేపథ్యంలో రాములోరి ప్రతి భక్తుడి ఇంటికి అయోధ్య రామయ్య రాబోతున్నడు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో ఇంటింటా కొలువు దీరేలా అయోధ్య రామయ్య చిత్రపటాలను తయారు చేయించారు.
అయోధ్యలో బాల రామయ్య కొలువుదీరిన వేళ అందరి అడుగులు రామయ్య దర్శనం కోసమే అన్నచందంగా ఉంది. తాజాగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అయోధ్య రాముడు ప్రతి ఇంటా కొలువుదీరబోతున్నడు. ముఖ్యంగా అయోధ్యలో రామ మందిర ప్రాణ:ప్రతిష్ట ప్రారంభమైనప్పటి నుండి తెలంగాణలో ప్రత్యేకించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికులు అయోధ్య వెళ్లాలని, శ్రీరామ చంద్రుడిని దర్శించాలని ఆశిస్తున్న వారే ఎక్కువ. ఈ నేపథ్యంలో రాములోరి ప్రతి భక్తుడి ఇంటికి అయోధ్య రామయ్య రాబోతున్నడు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో ఇంటింటా కొలువు దీరేలా అయోధ్య రామయ్య చిత్రపటాలను తయారు చేయించారు. అందుకోసం తన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంత మంది ఓటర్లున్నారు? ఎన్ని కుటుంబాలున్నాయి? అందులో అయోధ్య రామయ్యను తలిచి కొలిచే వాళ్లెందరున్నారు? అనే వివరాలను సేకరించారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న రామయ్య భక్తుల ఇంటి ఇంటికి అయోధ్య రామయ్య చిత్ర పటాన్ని పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిని దృష్టి లో ఉంచుకుని 4 లక్షల 21 వేల 11 వందల అయోధ్య రాముడి చిత్ర పటాలను తయారు చేయించారు బండి సంజయ్.. ఇప్పటికే లక్షకుపైగా రామయ్య చిత్ర పటాలు సిద్ధం కావడంతో ఇంటింటికీ చేరవేసే పనిలో కాషాయ శ్రేణులు నిమగ్నమయ్యాయి. ఈ పంపిణీ కార్యక్రమంలో నేను సైతం అంటూ బండి సంజయ్ తో పాటు రామయ్య భక్తులు పాల్గొననున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..