Vasanta Panchami: వసంత పంచమి శుభ సమయం ఎప్పుడు? విద్యార్థులు సరస్వతీ దేవిని ఎలా పూజించాలంటే..
విజ్ఞాన దేవతగా, వివేకధాత్రిగా బ్రహ్మ నాలుకపై నర్తించే చదువుల తల్లి సరస్వతి దేవి పురాణాల ప్రకారం వసంత పంచమి రోజున జన్మించింది. అందుకే ఈ రోజున అమ్మవారిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున సరస్వతిని పూజించి వారికి జ్ఞానం, తెలివి తేటలు మంచి కళలు లభిస్తాయని నమ్మకం. ఇది కాకుండా మరో కథ కూడా ఉంది. ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి సాత్వికురాలు.
హిందూమతంలో చదువుల తల్లి సరస్వతి దేవికి వసంత పంచమి రోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని శ్రీ పంచమి, సరస్వతీ పంచమి అని కూడా అంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న వసంత పంచమి పండుగను జరుపుకోనున్నారు. వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని పూజించడం ద్వారా తెలివితేటలు, చదువులో విజయాలు లభిస్తాయని నమ్ముతారు. వసంత పంచమి పండుగ రోజున విష్ణువు, సరస్వతిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున ఉదయం స్నానం చేసి, పసుపు బట్టలు ధరించి, ధూప దీపం, నైవేద్యంలతో పాటు కుంకుమతో అభిషేకం చేయాలి.
సరస్వతి దేవి ఆరాధనకు ముందు గణపతిని పూజించి, అటుపై శారదాంబ ప్రతిమను, పుస్తకాలను, పెన్నుని ఆరాధించాలి. షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి. పూజ అనంతరం సరస్వతి దేవికి పరమాన్నం, పులిహోరని నైవేద్యంగా సమర్పించాలి. వసంత పంచమి రోజున సంగీతం, లలిత కళలు, గానం, రచన మొదలైనవాటిని ప్రారంభిస్తే జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారు. వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా సరస్వతీ దేవీ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు
వసంత పంచమి శుభ సమయం
పంచాంగం ప్రకారం మాఘ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 02:41 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 12:09 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి 14 న జరుపుకుంటారు. ఈ రోజు ఉదయం 7:01 నుండి మధ్యాహ్నం 12:35 గంటల మధ్య సరస్వతీ దేవిని పూజించవచ్చు.
సరస్వతి దేవీ పూజా విధానం
- వసంత పంచమి రోజున స్నానం చేసిన తర్వాత పూజా స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేయండి .
- సరస్వతి దేవి విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్టించండి. వాటిని గంగాజలంతో శుద్ధి చేయండి
- సరస్వతి అమ్మవారి ముందు అగరబత్తీలు, ధూపద్రవ్యాలు వెలిగించి ఆమెను ధ్యానించండి.
- ఆసనం మీద కూర్చొని పూజ చేయండి. ఆసనం లేని పూజ నిరుపయోగంగా పరిగణించబడుతుంది.
- సరస్వతీ దేవికి తిలకం దిద్ది పూజల మాలను అలంకరించండి. తెల్లటి పుష్పాలు, అక్షతలు, శ్వేత వస్త్రం సమర్పించి పూజించాలి
- సరస్వతి దేవికి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్న, తెల్లని నువ్వులతో చేసిన లడ్డూలు, చెరకు రసం, తేనె, పండ్లను సమర్పించండి.
- సరస్వతి దేవికి సంబంధించిన సరస్వతీదేవి ద్వాదశ నామస్తోత్రలను జపించి చివర్లో హారతి ఇవ్వండి.
పౌరాణిక కథ
విజ్ఞాన దేవతగా, వివేకధాత్రిగా బ్రహ్మ నాలుకపై నర్తించే చదువుల తల్లి సరస్వతి దేవి పురాణాల ప్రకారం వసంత పంచమి రోజున జన్మించింది. అందుకే ఈ రోజున అమ్మవారిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున సరస్వతిని పూజించి వారికి జ్ఞానం, తెలివి తేటలు మంచి కళలు లభిస్తాయని నమ్మకం. ఇది కాకుండా మరో కథ కూడా ఉంది. ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి సాత్వికురాలు. సృష్టికర్త బ్రహ్మదేవుడి భార్య సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటోంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా భక్తులకు దర్శనమిస్తుంది.
సరస్వతి దేవి వీణ వాయించడం ప్రారంభించిన వెంటనే విశ్వమంతా ఒక భిన్నమైన తరంగం వ్యాపించింది ప్రతిదీ చాలా అందంగా మారింది. మానవులకు ప్రసంగం వచ్చింది. దీని సహాయంతో మాట్లాడగలరు. అప్పుడు బ్రహ్మ దేవుడు ఆమెను వాక్ దేవత అయిన సరస్వతి అని పిలిచాడు. తల్లి సరస్వతిని వాగీశ్వరి, భగవతి, శారద, వీణావాణి, వాగ్దేవి వంటి అనేక పేర్లతో పిలుస్తారు. సంగీతం ఆమె నుండి ఉద్భవించింది కాబట్టి, ఆమె సంగీత దేవతగా కూడా పరిగణించబడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు